సినిమా, మీడియా, రాజకీయ రంగాల్లో దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న “మీ టూ” ఉద్యమం తెలంగాణకు తీసుకొచ్చారు… వివాదాస్పద సినీ నటి శ్రీరెడ్డి. ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డిపై… శ్రీరెడ్డి.. తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి.. అక్కడి మీడియాకు ఓ ఇంటర్యూ ఇచ్చారు. “మీ టూ” ఉద్యమంపై స్పందిస్తూ.. తనకు ఎదురైన అనుభవాల్ని వివరించారు. ఆ క్రమంలో… జీవన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. జీవన్ రెడ్డి హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అతడికి అమ్మాయిలంటే పిచ్చి అని తేల్చారు. అతడు పెద్ద మోసగాడన్నారు. అతనికి నిర్మాత బెల్లంకొండ సురేశ్ సహాయం చేశాడు. అతడు ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడేవాడు. తాము అధికారంలో ఉన్నామని బెదిరింపులకు దిగేవాడని శ్రీరెడ్డి గుర్తు చేసుకున్నారు.
తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జీవన్ రెడ్డి వ్యవహారం.. హైలెట్ అయింది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉండంట.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కావడంతో… ఉన్న పళంగా .. తెలుగు మీడియా కూడా… ఆమె నోటితో మళ్లీ మళ్లీ జీవన్ రెడ్డిపై ఆరోపణలు చేయించడానికి ఉరుకులు పరుగులు పెట్టింది. ఆమెను హైదరాబాద్ పిలిపించి ఇంటర్యూలు తీసుకోవడం ప్రారంభించింది. ఇలాంటి అంశాల్లో ఎలా వ్యవహరించాలో.. శ్రీరెడ్డికి బాగా తెలుసు కాబట్టి… టాలీవుడ్ – పొలిటికల్ లింకులతో..”మీ టూ” ఉద్యమాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై… శ్రీరెడ్డి “మీ టూ” ఆరోపణలు చేశారు కానీ.. ఆయనపై నిజంగానే.. చాలా వివాదాలు ఉన్నాయి. దుబాయ్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడి పారిపోవచ్చారని… ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇటీవల తన నియోజకవర్గంలోని ఓ వ్యక్తి… తనపై కోర్టులో కేసు వేశారు. ఆ వ్యక్తి.. ప్రమాదంలో మరణించారు. ప్రమాదం చేసిన వాహనం.. జీవన్ రెడ్డి బంధువులదే. దాంతో ఆయనే హత్య చేయించారని గగ్గోలు పుట్టింది. ఇక శ్రీరెడ్డి చేసిన ఆరోపణల్లాంటి గుసగుసలు చాలా ఉంటాయి. ఇప్పుడు శ్రీరెడ్డి ఇష్యూతో బయటకు వచ్చింది. ఇంకెన్ని బయటకు వస్తాయో వేచిచూడాలి..!
BREAKING -Sri Reddy makes damning allegations on top Telangana leader Jeevan Reddy in interview to Tamil channel #MeeTooIndia
? జీవన్ రెడ్డి నన్ను పార్క్ హాయత్ హోటల్ లో బలవంతం చేశాడు
? జీవన్ రెడ్డి ఒక పెద్ద అమ్మాల పిచ్చొడు
? జీవన్ రెడ్డికి బెల్లంకొండ హెల్స్ చేశాడు pic.twitter.com/l7RLBaaukA
— Telugu360 (@Telugu360) October 13, 2018