టాలీవుడ్లో బయోపిక్‌లు పోటాపోటీగా తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్‌పై అయితే.. ఏకంగా మూడు బయోపిక్‌లు వస్తున్నాయి. క్రిష్ ఒకటి తీస్తుంటే… వర్మ మరోటి తెరకెక్కిస్తున్నాడు. కేతి రెడ్డి జగదీష్‌రెడ్డి `లక్ష్మీస్ వీరగంధమ్` అంటూ మరో బయోపిక్‌ని తీస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన వివాదాస్పద అంశాల్ని కూడా ఇందులో చర్చిస్తానని దర్శకుడు చెబుతున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. లక్ష్మీ పార్వతి పాత్రకు గానూ… శ్రీరెడ్డిని ఎంచుకున్నట్టు సమాచారం. కాస్టింగ్ కౌచ్ తుట్టెను టాలీవుడ్లో కదిపింది శ్రీరెడ్డినే. ఆ తరవాత చాలా వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారింది. `మా` సభ్యత్వం కోసం అర్థనగ్న ప్రదర్శన ఇచ్చి టాలీవుడ్ ని షేక్ చేసింది. ఈ దశలో శ్రీరెడ్డికి అవకాశాలు ఇస్తామని కొంతమంది దర్శకులు ముందుకొచ్చారు. తేజ లాంటి వాళ్లు.. ఆఫర్లు కురిపించారు. అయితే.. అవేం వర్కవుట్ అయినట్టు కనిపించలేదు. ఇప్పుడు కేతిరెడ్డి ఆమెకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి పాత్ర ప్రముఖమైనది.ఈ సినిమా టైటిలే ఆమె చుట్టూ తిరుగుతోంది కాబట్టి.. శ్రీరెడ్డి పాత్రకు వెయిటేజీ ఎక్కువే ఇవ్వాలి. మరి ఈ పాత్రలో శ్రీరెడ్డి ఎలాంటి నట విన్యాసాలు కనబరుస్తుందో చూడాలి.