శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు టాలీవుడ్ టాక్. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, అందుకే ఆత్మహత్యకు ప్రయత్నించిందని టాక్. పవన్ కల్యాణ్‌ని తిట్టడం, తద్వారా చెలరేగిన పరిణామాలు, ఆర్జీవి మధ్యలోకి వచ్చి.. శ్రీరెడ్డితో బేరం పెట్టినట్టు వార్తలు రావడం, దాన్ని ఆర్జీవీ కూడా ఒప్పుకోవడం.. ఇవన్నీ కలసి శ్రీరెడ్డితో బ్యాక్‌స్టెప్ వేయించేలా చేశాయి. దాంతో మానసికంగా ఒత్తిడికి గురైన శ్రీరెడ్డి ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంట. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు శ్రీరెడ్డినివాసానికి చేరుకుని, ఆమెను కాపాడి, ఓదార్చాయని తెలుస్తోంది. ఓమహిళా సంఘం నేత.. శ్రీరెడ్డిని తన ఇంటికి తీసుకెళ్లిందని, ప్రస్తుతం శ్రీరెడ్డి అక్కడే ఉందని సమాచారం. శ్రీరెడ్డి ఇది వరకే సూసైడ్ నోట్‌ని రాసి, తన దగ్గర పెట్టుకుందని, అందులో సినీ ప్రముఖుల పేర్లు ప్రస్తావించిందని సమాచారం అందుతోంది. తనకు ఏమైనా జరిగితే… ఫలానావాళ్లదే బాధ్యత అని క్లియర్‌గా రాసిందట. ఇప్పుడు వాళ్లని బెదిరించడానికే ఈ ప్రయత్నం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి శ్రీరెడ్డి తన ఆఖరి అస్త్రాన్ని కూడా ప్రదర్శించేసినట్టైంది.