ఇటీవలే జనసేన పార్టీకి ‘గాజు గ్లాసు’ ని ఎన్నికల గుర్తుగా కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. తమకు కేటాయించిన గుర్తు పై హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్ కి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక జనసైనికుల లో కూడా ఎన్నికల కమిషన్ గుర్తు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం అవుతోంది. ఇది సామాన్యుడు తాగే టీ గ్లాసు ని పోలి ఉండటంతో ఇది సామాన్యుడి గుర్తు అంటూ వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వాళ్ల ఆనందం మీద నీళ్లు చల్లడానికి అన్నట్టు శ్రీ రెడ్డి ఈ గుర్తు పై స్పందించారు. జనసేన పార్టీని , నాగబాబును వెటకారం చేస్తూ పోస్ట్ చేశారు. కాస్టింగ్ కౌచ్ సమస్య పై గళం ఎత్తడానికి వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి ఆ తర్వాత అన్ని సమస్యలను పక్కన పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ మీద మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఎన్నికల గుర్తు సందర్భంగా స్పందించిన శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “అరె.. జనసేన పార్టీ గుర్తు గలాసు అంటగా.. అది బీరు గ్లాసా? వైన్ గ్లాసా? స్కాచ్ గ్లాసా? పనిలో పనిగా నాగబాబు గారికి కూడా ఓ గ్లాస్ ఇవ్వండర్రా. అసలే రీసెంట్ గా కొత్త గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు” అంటూ జనసేన పార్టీ గుర్తుపై తనదైన శైలిలో స్పందించింది శ్రీరెడ్డి.
అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలపై నెటిజనులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. మనం ఎలాంటి వాళ్లనైతే మనకు అలాంటివే కనిపిస్తాయి అని సమాధానం ఇస్తూ, సామాన్యులకు ఈ గాజు గ్లాసులో టీ గ్లాసు కనిపిస్తే శ్రీ రెడ్డి లాంటి వాళ్లకు మాత్రం మందు గ్లాసులు కనిపించాయని, ఆమె మద్యపానానికి ఎంతగా అలవాటయింది అన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది అంటూ నెటిజన్లు శ్రీ రెడ్డి కామెంట్స్ కి కౌంటర్స్ ఇస్తున్నారు.