తెలుగు సినీ పరిశ్రమలోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ విపరీతంగా పెరిగిపోయిందని వ్యాఖ్యలు చేసి, పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న నటి శ్రీరెడ్డి కొద్దిరోజులుగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. మరొక సంచలనానికి తెర తీసింది. ఏకంగా మంచి కాఫీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసిన దర్శకుడిపై ఎక్కుపెట్టి పోస్టులు చేసింది. కొమ్ములు వచ్చిన శేఖరుడు అంటూ ఆయన పేరు చెప్పకనే చెప్పింది. కానీ ఆమె పోస్టులోని ఒక వ్యాఖ్య ఆమె అబద్దం చెబుతోందేమోనన సందేహన్ని కలిగిస్తోంది చదివిన జనాలకి.
ఇంతకీ ఆమె ఏమని పోస్ట్ చేసిందంటే..- “పెద్ద డైరెక్టర్ అని పొగరు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికి రారు అని అతడి ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్క పీచు సోగ్గాడు. ఊగితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువ. టెక్నికల్ గా దొరకకుండా బాగా వాడాడు టెక్నాలజీని. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం.. మేల్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాకు. వారెవరో కాదు.. కొమ్ములు వచ్చిన శేఖరుడు.’
అయితే ఇక్కడ మతలబు ఏంటంటే, అంత పెద్ద డైరెక్టర్ మీద అభాండాలు వేసినప్పుడు ఖచ్చితంగా ఆధారాలు చూపమని ఎవరైనా అడుగుతారు. మరి ఆమె దగ్గర అలాంటి ఆధారాలున్నాయా. ఆమె పోస్ట్ జాగ్రత్తగా చూస్తే, ఆమె దగ్గర ఈ విషయమై ఎటువంటి ఆధారాలూ లేవని అర్థమవుతోంది. అందుకే ఆమె – ” టెక్నికల్ గా దొరకకుండా బాగా వాడాడు టెక్నాలజీని”. అని వ్రాసుకొచ్చింది. మరి ఈమె దగ్గర ఆధారాలు లేవని తానే చెబుతున్నపుడు, ఎవరైనా ఎలా నమ్ముతారు. అసలు ఆమె చెబుతోంది నిజమేనా? ఒకవేళ నిజమే అయితే అందరి పేర్లూ ఒక్క సారిగా బయటపెట్టడానికి ఆమె కి ఉన్న అభ్యంతరాలేంటి. లీకులిచ్చి అందరి మీదా డౌట్లు క్రియేట్ చేయడం వల్ల దీంతో సంబంధం లేని వాళ్ళు కూడా ఇబ్బందిపడుతున్నారు కదా.. ఇవీ ఇండస్ట్రీ తరపున వినిపిస్తున్న ప్రశ్నలు.