కాస్టింగ్ కౌచ్ అంటూ చర్చ మొదలు పెట్టి దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి చివరికి పవన్ కళ్యాణ్ కి మీడియాకి మధ్య యుద్ధానికి దారి తీసేలా చేసిన శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పింది అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి సారీ చెప్పింది. వివరాల్లోకి వెళితే..
“రకుల్ ప్రీత్ సింగ్ కి నా క్షమాపణలు” అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి . గతంలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని శ్రీ రెడ్డి సమస్య మొదలు పెట్టినప్పుడు, తనకెప్పుడూ అలాంటి సమస్య ఎదురు కాలేదని, కోట్లకు కోట్లు పెట్టి సినిమా తీసేవాళ్ళు లాభాలు రావాలని చూస్తారు తప్ప కాస్టింగ్ కౌచ్ గురించి కాదని రకుల్ ప్రీత్ సింగ్ విమర్శించిన విషయం తెలిసిందే. దానికి అప్పుడే శ్రీ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇవ్వడం కూడా తెలిసిందే. అయితే ఆ విషయాలకు ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కి క్షమాపణ చెప్పింది శ్రీ రెడ్డి.
అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ట్వీట్ చేస్తూ – “మానవత్వం బతికే ఉంది, కుటుంబానికి దూరమై ఏకాకి అయిన నాకు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు తిన్నావా అక్క, బాగున్నావా అని మెసెజ్ లు చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి , థాంక్స్ పవన్ కళ్యాణ్ ఫాన్స్” అంటూ ట్వీట్ చేసింది శ్రీ రెడ్డి.