మీడియా ఎవరినైనా సెలబ్రెటీల్ని చేసేస్తుంది. గాసిప్పులు రాసుకోవడానికి కాస్త సందు చూపిస్తే చాలు.. రాత్రికి రాత్రే… సెలబ్రెటీల్ని తయారు చేస్తుంది. శ్రీరెడ్డి కూడా అలా పాపులర్ అవుతోంది. శ్రీరెడ్డి పేరు నిన్నా మొన్నటి వరకూ ఎవరికీ తెలీదు. కొన్ని వెబ్ మీడియా ఇంటర్వ్యూలలో.. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలతో.. తన పేరు మార్మోగిపోయింది. మహా టీవీ ఆమెని లైవ్ కి తీసుకొచ్చి మరింత పాపులర్చేసింది. సినిమా పరిశ్రమ గురించి, ఇక్కడి బాగోతాల గురించీ శ్రీరెడ్డి చాలా బోల్డ్‌గా మాట్లాడుతోంది. అవి హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. దీని వల్ల శ్రీరెడ్డికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇలా శత్రువుల్ని పెంచుకుంటూ పోతే… ఆమెకే నష్టం కదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నా.. శ్రీరెడ్డి టార్గెట్ మరేదో అయ్యిండొచ్చని గుసగుసలూ వినిపిస్తున్నాయి.
త్వరలోనే బిగ్ బాస్ 2 సెషన్ ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం సెలబ్రెటీలకు జల్లెడపడుతోంది స్టార్ మా. అలా వాళ్ల దృష్టిలో పడడానికి శ్రీరెడ్డి ఇలా మీడియాకెక్కి రచ్చ చేస్తోందని కొంతమంది సందేహాలు వెలుబుచ్చుతున్నారు. బిగ్ బాస్ షో తెలుగులో బాగా హిట్టయ్యింది. ఆ 70 రోజులూ… ఏ ఇంట్లో చూసినా బిగ్ బాస్ కోసమే చర్చ. షోలో పాల్గొంటే పాపులారిటీతో పాటు పైకం కూడా బాగా ముడుతోంది. సోషల్ మీడియా ద్వారా ఫోకస్ అయినవాళ్లకు ఇలాంటి షోలలో చోటు దక్కుతోంది. శ్రీరెడ్డి కూడా బిగ్ బాస్ కోసమే.. ఇలా సంచలనం సృష్టించే కామెంట్స్ చేస్తోందని కొంతమంది డౌట్. అతి త్వరలో బిగ్ బాస్ షో.. మొదలు కాబోతోంది. అందులో శ్రీరెడ్డికి కూడా ఛాన్స్ దొరికే అవకాశాలు లేకపోలేదని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ నుంచి ఆమెకు పిలుపు వస్తే.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు పరోక్షంగా ఆమెకు సహాయపడినట్టే.