హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవి విజయవాడలో సందడిచేశారు. బందరు రోడ్లో ఒక నగల దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, విజయవాడకు ఎప్పుడో షూటింగ్లకోసం వచ్చానని, మళ్ళీ ఇదే రావటమని అన్నారు. విజయవాడతో తనకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. మళ్ళీ ఇక్కడకు రావటం సంతోషంగా ఉందని చెప్పారు. తిరిగి ఎప్పుడు వస్తారని అడగగా, తన కూతురి పెళ్ళికి బంగారం కొనటానికి వస్తానని చెప్పారు. నిమ్మపండు రంగు చీరలో శ్రీదేవి బంగారంలా మెరిసిపోతూ కనిపించారు.