వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. ప్రేక్షకులకు ఆమె అతిలోక సుందరి. ఇప్పటికీ శ్రీదేవి అంటే ఆ క్రేజే వేరు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి.. ఇప్పుడు రవి ఉదయవర్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి ‘మామ్’ అనే టైటిల్ పెట్టారు. హీరోయిన్ ఓరియంటడ్ సినిమా ఇది. సవతి తల్లి, సవతి కూతురు మధ్య నడిచే కథ. ఓ సవతి తల్లి కూతురిపై జరిగిన అఘాయిత్యానికి ఎలా న్యాయం చేసింది అన్న నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. శ్రీదేవి భర్త బోణీ కపూర్ ఈ సినిమాకు నిర్మాత.
తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ బయటికివచ్చింది. ఈ ఫస్ట్‌లుక్‌లో నల్లచీరలో సీరియస్ గా ఆలోచిస్తున్న శ్రీదేవిపై , మా, మామ్, అమ్మీ,ఆయీ.. అంటూ వివిధ భాషల్లో తల్లిని ఏమని పిలుస్తారో రాశారు. అయితే ఇక్కడ తెలుగు భాషను ఎగ్నోర్ చేశారు. చివరికి చైనా భాషలో కూడా రాశారు కానీ ”అమ్మ” అనే మాట కనిపించలేదు. శ్రీదేవి అంటే మన హీరోయినే అనే ఫీలింగ్ ప్రేక్షకులది. అలాంటి శ్రీదేవి పోస్టర్ పై తెలుగు లెటర్ కనిపించకపోవడం గమనార్హం. . ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తెలుగులో డబ్ చేసి మరీ విడుదల చేశారు ఇక్కడ. మరి, అలాంటి డబ్బింగ్ ఆలోచన ఏదైనా చేసి స్వయంగా తెలుగులో ఓ పోస్టర్ రిలీజ్ చేసే సన్నాహాలు జరుగుతాఏమో చూడాలి.