శ్రీదేవి సోడా సెంటర్లో కథానాయిక పాత్రకీ చాలా ప్రాధాన్యం ఉంది. శ్రీదేవిగా ఆనందిని చక్కగా నటించింది. అందంగా కనిపించింది. క్లైమాక్స్ లో తన పాత్ర మరింత ఆకట్టుకుంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తనకు చాలా ప్లప్. కానీ ఈ సినిమా ప్రచారంలో ఆనందిని ఎక్కడా కనిపించలేదు. ఇక మీదట కనిపించదు కూడా.
ఈ సినిమా షూటింగ్ అయిన తరవాత ఆనందిని అసలు చిత్రబృందానికి టచ్లో లేకుండా పోయిందట. సినిమా ప్రమోషన్లకు ఆనందిని తీసుకురావాలని దర్శక నిర్మాతలు చాలా ప్రయత్నించారు. కానీ తన ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది. ఎన్నిసార్లు చేసినా స్విచ్చాఫేనట. చివరికి ఆనందని కాంటాక్ట్ ఏదోలా పట్టుకుంటే.. అసలు విషయం తెలిసింది. ఆనంది తల్లయ్యిందట. ఇటీవల ఆనందిని పెళ్లి చేసుకుంది. అప్పుడే తల్లి అయిపోయింది. అందుకే… ప్రమోషన్లకు రాలేకపోతున్నా అందట. ఏ సినిమాకైనా ప్రమోషన్లు చాలా అవసరం. పైగా ఈసినిమాలో శ్రీదేవి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. టైటిలే.. ఆ పాత్ర పై డిజైన్ చేశారు. అలాంటప్పుడు ఆనందిని వస్తే బాగుండేది అనుకున్నారంతా. చివరికి.. తను ఇలా చెప్పేసరికి.. ప్రమోషన్ల గ్యాస్ తీసేసినట్టైంది.