శ్రీదేవి కూతురు జాన్వీ ‘దఢక్’ అనే సినిమాతో కథానాయికగా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా గా ‘సింబా’ అనే మరొక సినిమా లో కూడా నటిస్తోంది జాన్వీ. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా ఇటీవల విడుదల చేశారు.
జాన్వీ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ‘దఢక్, మరాఠీ బ్లాక్‌బస్టర్ ‘సైరాత్’కు హిందీ రీమేక్ అయితే, రోహిత్ శెట్టి దర్శకత్వం లో వస్తున్న ‘సింబా’ తెలుగు సూపర్ హిట్ ‘టెంపర్’ కు హిందీ రీమేక్. ఎన్టీఆర్ పాత్రలో హీరో రణ్వీర్ సింగ్ నటిస్తుంటే, కాజల్ పాత్రలో జాన్వీ చేస్తోంది. తెలుగు తో పోలిస్తే, హిందీ లో హీరోయిన్ పాత్రని మరింత పెంచినట్టు వివరించారు దర్శకుడు రోహిత్ శెట్టి .ఇక మరాఠీ సినిమా సైరాత్ సినిమా మొత్తం హీరోయిన్ పాత్ర మీదే నడుస్తుంది. మరాఠీలో వంద కోట్లు సాధించిన మొదటి సినిమా ఇది. గుండెలు పిండేసే క్లైమాక్స్ ఉన్న ఈ సినిమా విడుదలైన కొత్తలో అమీర్ ఖాన్, అమితాబ్ సహా చాలా మంది ప్రముఖులు ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే కథల పరంగా చూస్తే రెండు సినిమాలూ మంచి కథలే అయినప్పటికీ రెండు రీమేకులే కావడం విశేషం. ఎంత కాదనుకున్నా, ఒరిజినల్ లో నటించిన హీరోయిన్లతో పోలిక ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా సైరత్ సినిమా లో రింకు నటన కోసమే మరాఠీ జనాలు మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూసారంటే అతిశయోక్తి కాదు. జమీందారీ కుటుంబ పెద్దింటి అమ్మాయి పాత్రలో ఆ అమ్మాయి జీవించేసింది. ఇక కాజల్ ఏమో సీనియర్ హీరోయిన్. మరి ఆ నటీమణులతో పోల్చినప్పుడు కొత్త హీరోయిన్ జాన్వీ నటన ఏ మాత్రం తేలిపోయినా అది ఆమె కెరీర్ పై గట్టిగా ప్రభావం చూపుతుంది.
మరి శ్రీదేవి ఎందుకని ఈ రిస్క్ తీసుకుందో. హిట్టయిన సినిమాలు కాబట్టి మినిమం గ్యారంటీ ఉందనుకుందా. ఏది ఏమైనా శ్రీదేవి తీసుకున్న రిస్క్ ఎలాంటి ఫలితమిస్తుందో తెలియాలంటే ఈ రెండు సినిమాలు విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.