శ్రీకాంత్ .. తన వారసుల గురించి బాగానే ఆలోచిస్తున్నాడనిపిస్తోంది. ఓ తండ్రిగా వాళ్లకు గట్టి పునాది ఏర్పరచాలని తపిస్తున్నారు. పెద్ద కొడుకు రోషన్ ‘నిర్మాల కాన్వెంట్’తో పరిచయం అయ్యాడు. కుర్రాడు చూడ్డానికి బాగానే ఉన్నా.. నటుడిగా నిరూపించుకోవాలంటే ఇంకొంత నేర్చుకోవాలి. అందుకే.. నిర్మల కాన్వెంట్ తరవాత తనకు కొన్ని అవకాశాలొచ్చినా.. శ్రీకాంత్ టెమ్ట్ అవ్వలేదు. తనయుడ్ని అమెరికాలో చదివిస్తూ.. అక్కడే నటనలో తర్పీదు ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు చిన్న కొడుకు రోహన్ వంతు వచ్చింది. తను స్కూలుకి వెళ్లే పిల్లాడే. కానీ నటన అంటే మక్కువ. అందుకే.. ఇప్పటి నుంచే ప్రోత్సహించడం మొదలెట్టాడు. ప్రభుదేవా సినిమాలో రోహన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడిప్పుడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో ప్రభుదేవా, రోహన్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. అట్లీ దగ్గర శిష్యరికం చేసిన ఆకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రోషన్ ట్రైనింగ్ పూర్తయ్యాక.. నేరుగా హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలన్నది శ్రీకాంత్ ప్లాన్. అలా కొడుకులిద్దరి కోసం గట్టి ప్లానులే వేస్తున్నాడు శ్రీకాంత్.