కెరీర్ నాశనమైపోవడానికైనా.. దూసుకెళ్లిపోవడానికైనా ఒక్క సినిమా చాలు. ఆ ఒక్క సినిమా.. బ్రహ్మోత్సవం రూపంలో ఎదురైంది శ్రీకాంత్ అడ్డాలకు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో శ్రీకాంత్ కెరీర్ అగమ్య గోచరంగా తయారైంది. ఒకవేళ బ్రహ్మోత్సవం విడుదలైతే పెద్ద పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు శ్రీకాంత్ అడ్డాల ఇంటి ముందు క్యూలో నిలబడేవారు. కనీసం యావరేజ్ అయినా ఇంకో సినిమా ఉండేది. కానీ… ఇప్పుడా పరిస్థితి లేదు. శ్రీకాంత్‌తో సినిమాలు చేద్దామనుకొన్న నిర్మాతలు ఇప్పుడు సైడ్ అయిపోయారు. పెద్ద హీరోలిప్పుడు శ్రీకాంత్‌ని తీసుకొని.. సాహసం చేయలేరు. ఆ సంగతి శ్రీకాంత్‌కీ బాగా తెలుసు. అందుకే… ఇప్పుడు మళ్లీ తన స్టైల్లో ఓ చిన్న సినిమా తీసి… జనం దృష్టిలో పడాలని డిసైడ్ అయిపోయాడట.
శ్రీకాంత్ అడ్డాలకు దర్శకుడిగా లైఫ్ ఇచ్చిన దిల్‌రాజు ఈసారి.. మరోసారి తన దర్శకుడ్ని ఆదుకోవడానికి ముందుకొచ్చినట్టు టాక్. కొత్తవాళ్లతో.. ఓ ప్రేమకథ తీయడానికి దిల్‌రాజు రెడీ అయ్యాడని, దానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తారని టాక్. కొత్తబంగారు లోకం టైపులో మళ్లీ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో అందరికీ దగ్గరవ్వాలని, తన కెరీర్ ఎక్కడైతే మొదలైందో మళ్లీ అలాంటి సినిమాతో తన కెరీర్‌ని నిలుపుకోవాలని చూస్తున్నాడట. ఆలోచన మంచిదే. మరి.. విజయం మాటేంటో చూడాలి.