నందమూరి బాలకృష్ణ, కె.ఎస్ రవికుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. నయనతార కథానాయిక. సి.కల్యాణ్ నిర్మాత. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో మరో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారని, ఈ మేరకు శ్రీకాంత్ నుంచి కూడా అంగీకారం వచ్చేసింది ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై తెలుగు 360.కామ్ ఆరా తీసింది. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడన్నది కేవలం రూమర్ మాత్రమే అని తేలింది. ఈ సినిమాలో శ్రీకాంత్ నటించడం లేదని చిత్రబృందం రూఢీగా చెప్పేసింది. ”ఓ పాత్ర కోసం శ్రీకాంత్‌ని సంప్రదించిన మాట వాస్తవమే. అయితే అది ప్రతినాయకుడి పాత్ర కాదు. శ్రీకాంత్ డేట్లు అందుబాటులో లేకపోవడం వల్ల.. మరో కథానాయకుడి కోసం ప్రయత్నిస్తున్నాం. అదో కీలకమైన పాత్ర అంతే. విలన్ గా కాదు. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారో త్వరలో చెబుతాం’ అని చిత్రబృందంలోకి కీలక వ్యక్తి సమాచారం అందించారు. సో… శ్రీకాంత్ విలన్ గా మారడం కేవలం గాలి వార్త అన్నమాట.