శ్రీకాంత్ రివ్యూ: స్ఫూర్తినిచ్చే తెలుగు తేజం

శ్రీకాంత్ బొల్లా.. ఈ పేరు చాలామందికి సుపరిచితమే. బొల్లంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీకాంత్. పుట్టుకతో చూపులేని శ్రీకాంత్.. ప్రతిష్టాత్మక ఎంఐటీలో చదువుకొని, స్వదేశానికి తిరిగొచ్చి ఇక్కడ పరిశ్రమ స్థాపించి చూపులేని ఇంకెంతో మందికి ఉపాది కల్పించిన రియల్ హీరో. శ్రీకాంత్ కథ బాలీవుడ్ దర్శకుడు తుషార్ హీరానందని ఆకర్షించింది. రాజ్‌కుమార్ రావు టైటిల్ రోల్ లో శ్రీకాంత్ బియోపిక్ ని తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. మరి శ్రీకాంత్ జీవితంలోని విశేషాలేంటి? తెలుగు నేలపై పుట్టిన శ్రీకాంత్ జీవితం ప్రపంచానికి ఎలాంటి స్ఫూర్తి చాటింది?

1991. ఆంధ్రప్రదేశ్‌, మచిలీపట్నంలోని ఓ మారుమూల గ్రామం సీతారామపురం. అక్కడ వ్యవసాయం చేసుకొని బ్రతికే దంపతులకు తొలి సంతానంగా ఓ బాబు పుడతాడు. పుట్టగానే ఆ బాబుని ఎత్తుకున్న తండ్రి ”నా బిడ్డ.. కృష్ణమాచారి శ్రీకాంత్ లా పెద్ద క్రికెటర్ అవుతాడు. దేశానికి ఆడుతాడు’ అని పొంగిపోతాడు. ఆ కాసేపటికే తెలుస్తుంది.. పుట్టింది చూపులేని పిల్లాడని. చూపులేని బిడ్డని సాకడం కష్టమని ఊర్లో అంతా చెబుతారు. ఆ బాబుని పూడ్చేయాలనే నిర్ణయానికి వచ్చేస్తాడు తండ్రి. తర్వాత ఏం జరిగింది ? చూపులేని శ్రీకాంత్ ఎంఐటీ ఎలా చేరాడు ? శ్రీకాంత్ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి ? ఇదంతా మిగతా కథ.

అసాధారణ జీవిత ప్రయాణాలే బయోపిక్స్ గా తెరపైకి వస్తుంటాయి. శ్రీకాంత్ జీవితం కూడా అసాధారణమే. ఇంకా చెప్పాలంటే అన్ బిలివబుల్. తన కథలో అనేక సన్నివేశాలు మ్యాజికల్ గా అనిపిస్తాయి. శ్రీకాంత్ పుట్టుకతో కథ మొదలౌతుంది. చూపులేని తనని పాతిపెట్టేయాలని నిర్ణయించుకోవడం, దీనికి తల్లి అడ్డుపడిన దృశ్యాలు చుస్తున్నప్పుడు గుండెను పట్టేసినట్లు అనిపిస్తుంది. ఆ పిల్లాడి జర్నీ చివరి దాక చూడాల్సిందేననే ఆసక్తి ఆ సన్నివేశంలోనే పడిపోతుంది.

శ్రీకాంత్ కి చూపులేదు కానీ మిగతా అన్ని విషయాల్లో తను చైల్డ్ ప్రాడిజీ. కాల్యుకులేటర్ తో సమానంహగా లెక్కలు చెబుతుంటాడు. సైన్స్ పై విపరీతమైన ఆసక్తి. గ్రామంలో ఓ టీచర్ సలహా మేరకు హైదరాబాద్ లోని స్పెషల్ స్కూల్ లో చేరిన తర్వాత తన జీవితం మరింత మెరుగుపడుతుంది. అక్కడే దేవిక (జ్యోతిక) టీచర్ శ్రీకాంత్ జీవితంలోకి వస్తుంది. చూపులేని వారికి సైన్స్ గ్రూప్ చదివే అవకాశం లేదు. ఈ విషయంలో శ్రీకాంత్ చేసిన న్యాయపోరాటం ఆసక్తిగా వుంటుంది. సైన్స్ కి విజన్ వుండాలని కోర్టులో తను వాదించిన తీరు, న్యూటన్- యాపిల్ ఎపిసోడ్ పై తనిచ్చే వివరణ చాలా లాజికల్ గా అర్ధవంతంగా వుంటుంది.

ఐఐటీలో చేరినప్పుడు కూడా మళ్ళీ ఇదే సమస్య ఎదురౌతుంది. అసలు చూపులేని వారికి ఐఐటీలో చేరే అవకాశమే లేదు ఈ దేశంలో. అయితే అప్పటికే న్యాయపోరాటంతో విసిగిపోయిన శ్రీకాంత్…. స్వదేశంలో కాకుండా విదేశాల్లో చదవాలని నిర్ణయించుకుంటాడు. స్కాలర్షిప్ తో పాటు ఎంఐటీలో చేరే అవకాశాన్ని కల్పిస్తుంది అమెరికా. బ్రెయిలీ లిపితో కూడిన మెటిరియల్ అక్కడ అందుబాటులో వుండటం చూసినప్పుడు ఆమెరికా పై గౌరవం పెరుగుతుంది.

చదువుపూర్తయిన తర్వాత శ్రీకాంత్ జీవితంలో మరో మలుపు. చూపులేని వారికి ఉపాది కల్పించాలనే ఆలోచన తనని వ్యాపారం వైపు నడుపుతుంది. ఈ దశలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన తొలి ఇన్వెస్ట్మెంట్ తో బొల్లంట్ ఇండస్ట్రీస్ కి భీజం పడుతుంది. వ్యాపారంలో ఎదురైన సమస్యలు, బొల్లంట్ ఇండస్ట్రీస్ నిలదొక్కుకునే వైనాన్ని ఆసక్తిగానే చూపించారు.

ఇదే సమయంలో సక్సెస్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ లో వచ్చిన మార్పుని కూడా నిజాయితీగా చూపించారు. రాజకీయాల జోలికి వెళ్ళడం, రాజకీయాలు ఫేవర్ గా వుంటే ఇంకా ఎక్కువ ఎదగొచ్చనే ధోరణి శ్రీకాంత్ లో కనిపిస్తాయి. అయితే ఆ దశని దాటుకొని మళ్ళీ పాత శ్రీకాంత్ ని దర్శకుడు తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకునేలా వుంది. తనపై సింపతి చూపించడం ఇష్టం లేదని, తనలాంటి వారిపై సింపతి కాకుండా సమానత్వం చుపాలన్నదే తన అభిమతమని శ్రీకాంత్ చివర్లో ఇచ్చిన ప్రసంగం కదిలించేలా వుంటుంది.

శ్రీకాంత్ పాత్రకి ప్రాణం పోశాడు రాజ్ కుమార్ రావు. ఆద్యంతం పాత్రంలో పరకాయ ప్రవేశం చేశాడు. దిశతప్పి రోడ్డుపై నడిచిన దృశ్యం, కోర్టులో వాదించిన సీన్, ఎయిర్ పోర్ట్ సీన్స్ కి క్లాప్స్ పడతాయి. దేవిక పాత్రలో జ్యోతిక హుందాగా కనిపించింది. శ్రీకాంత్ కి నీడలాంటి పాత్ర. రవి (శరద్ కేల్కర్) ది కూడా కీలకపాత్రే. ఆ పాత్రకి తగిన న్యాయం చేశాడు. శ్రీకాంత్ ప్రేయసి స్వాతిగా అలయ పద్దతిగా కనిపించింది.

టెక్నికల్ గా సినిమా డీసెంట్ గా వుంది. అమెరికాలో చిత్రీకరించిన సన్నివేశాలు చాలా ప్లజెంట్ గా వున్నాయి. ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాలోని పాపా కెహతే హై పాట ఆద్యంతం నేపధ్య సంగీతంగా వాడిన తీరు ఆకట్టుకుంది. చాలా అర్ధవంతమైన మాటలు రాసుకున్నారు. తనపై జాలి దయ అవసరం లేదు సమానత్వం కావాలనేది శ్రీకాంత్ ఆశయం. నిజానికి ఇది గొప్ప స్ఫూర్తినిచ్చే ప్రయాణం. సమయం కుదిరినప్పుడు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close