రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. అంటే మంత్రి హోదా అన్నమాట. ఆయనకు మంత్రి హోదా ఎందుకు అంటే.. శాసనసభా వ్యవహారాలను సమన్వయం చేసుకుంటారట. నిజానికి ఆయన ఇప్పటి వరకూ ఈ ప నులు చేశారు. అంటే చీఫ్ విప్‌గా పని చేశారు. కానీ ఆయనకు ఆ పదవి తొలగించి మంత్రి పదవి ఆశించిన ముదునూరి ప్రసాదరాజుకు చీఫ్ విప్ ఇచ్చారు. మంత్రివర్గంలో క్షత్రియులను తొలగించి ఇలా న్యాయం చేశామని చెప్పుకున్నారు .
ఇప్పుడు ఆయనకు శాసనసభా వ్యహారాలను సమన్వయం చేసుకోవడం… లాంటి విధులను ఇవ్వడం అంటే.. చీఫ్ విప్‌గా వ్యవహరించడమే. ముదునూరి ప్రసాదరాజుకు పేరుకు మాత్రం చీఫ్ విప్ పదవి ఉంటుంది. బాధ్యతలన్నీ రెడ్డి చూసుకుంటారు. అదే సమయంలో ఆయనకు కేబినెట్ హోదా కూడా ఇచ్చారు కాబట్టి.. ఇక చీఫ్ విప్‌కు ప్రోటోకాల్ కూడా లభించడం కష్టమనుకోవచ్చు. ఏపీలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా అంతా ఓ సామాజికవర్గమే పనులు చేస్తుందని.. విధులు నిర్వహిస్తుదంన్న ప్రచారం ఉంది. ఆ ప్రకారమే తాజా నియామకం జరిగింది.
మరో వైపు శ్రీకాంత్ రెడ్డి జగన్ చిన్న నాటి స్నేహితుడు. రాయచోటిలో ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు. వైసీపీలో వర్గాలు ఏర్పడ్డాయి. ఓ బీసీ నేతకు జగన్ ఎమ్మెల్సీ ఇవ్వడంతో శ్రీకాంత్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. తనకు చెక్ పెడుతున్నారని ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయనను బుజ్జగించడానికి జగన్ కేబినెట్ హోదా ఇచ్చారు. రెండేళ్లు లేదా ఎప్పటి వరకూ అవసరం పడితే అప్పటి వరకూ ఉత్తర్వులు ఇచ్చారు కానీ.. ప్రభుత్వం మహా అయితే.. రెండు, మూడు సార్లు మాత్రమే ఎన్నికల్లో అసెంబ్లీని నిర్వహిస్తుంది. కానీ శ్రీకాంత్ రెడ్డికి మాత్రం కేబినెట్ హోదా ప్రభుత్వం పోయే వరకూ ఉంటుంది