బాహుబలి తరవాత… కుటుంబానికి విధేయుడిగా ఉంటూ, చివర్లో వెన్నుపోటు పొడిచి ట్విస్ట్ ఇచ్చేవాళ్లు కట్టప్ప అని పిలవడం మొదలెట్టారు. బాహుబలి 1 చూశాక, 2 చూడాలన్న కుతూహలాన్ని పెంచింది కట్టప్ప పాత్రే. అయితే సరిగ్గా… ఇలాంటి పాత్రే… రామ్ చరణ్ సినిమాలోనూ ఉందట. రామ్ చరణ్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. కైరా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ పాత్ర చాలా ప్రధానం. ఆ పాత్ర `కట్టప్ప` స్థాయిలో ఉంటుందని టాక్.
శంకర్ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడు. తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది. అప్పటి చరణ్, శ్రీకాంత్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. కలిసే పార్టీ పెడతారు. కలిసే పార్టీ కోసం పనిచేస్తారు. అయితే చివర్లో చరణ్‌కి వెన్ను పోటు పొడిచి, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా మారతాడు. అక్కడ ఈ కథ మలుపు తిరగబోతోందని టాక్ వినిపిస్తోంది. సో చరణ్ సినిమాలో శ్రీకాంత్ ది కట్టప్ప లాంటి పాత్ర అన్నమాట. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించబోతున్నాడు. శ్రీకాంత్ కీ, సూర్యకీ లింకేమిటన్నది కూడా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. `అఖండ`లో విలన్ గా దర్శనమిచ్చాడు శ్రీకాంత్. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. కానీ శ్రీకాంత్ పాత్ర కి పెద్ద స్పెస్ లేదు. కానీ ఈ సినిమాలో మాత్రం శ్రీకాంత్ పాత్ర ఓ రేంజ్ లో ఉండబోతోందని టాక్.