మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ వర్గం ఓటుకి పాతిక వేలు పంపుతున్నారంటూ నరేష్ ఓ వీడియో విడుదల చేశారు. దానికి వెనువెంటనే శ్రీకాంత్ కూడా గట్టిగా సమాధానం చెబుతూ మరో వీడియో వదిలారు. ”నరేష్ గారూ.. మీ వీడియో చూశా.. నరేష్ గారూ ఇంకా ఎందుకండీ అబద్ధాలు ఆడుతున్నారు? మేం డబ్బులు పంచుతున్నామా? మీరు ఎవరితోనో డబ్బులు పంపించి, ప్రకాష్‌రాజ్ ఇస్తాడు అని చెప్పదలచుకున్నారా? ఎగస్ట్రాలు మాట్లాడడం ఆపేయండి” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
”డబ్బులు పంచేది మీరు, మందు పార్టీలు ఇచ్చేది మీరు… ఇప్పుడు మాపై బురద చల్లుతారా? ఇప్పటికే మా అప్రతిష్ట పాలు చేశారు. గతంలో రావాల్సిన నిధుల్ని రాకుండా అడ్డు పడ్డారు. ఇప్పుడు మళ్లీ ఆటంకాలు సృష్టిస్తారా. డబ్బులు పంచిపెడుతూ దొరికిపోతే… మేం పంచామని చెప్పడానికి ఇదో డ్రామానా. దసరా పండగ జరుగుతోంది. దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా. మేం అబద్ధాలు ఆడితే మేం నాశనం అయిపోతాం” అంటూ ఆవేశంగా మాట్లాడాడు శ్రీకాంత్. తమ కల్చర్ అది కాదని, అంతకు దిగజారలేదని చెబుతూనే ఇలాంటి ప్రలోభాలకు ఎవ్వరూ లొంగొద్దని మా సభ్యుల్ని కోరాడు.