ఆఫ్రికా ఖండంలోని సంక్షుభిత దేశం సెనగల్కు వెళ్లి కిడ్నాపైన తిరువాన్కూరు రాజ వంశ వారసుడు రచయిత శ్రీకుమార్ వర్మ ఎట్టకేలకు విడుదలైనాడు. భారత దేశంలో ఇంటింటా కనిపించే చిత్రాలు వేసిన రాజా రవివర్మ మనవడే శ్రీకుమార్. తాతగారు వేసిన కొన్ని బొమ్మలకు మంచి ధర వస్తుందని ఎవరో బేరం చెబితే ఆశపడి ఎవరికీ చెప్పకుండా వెళ్లారు. అక్కడ సుబ్రహ్మణ్య శేషాద్రి అనే మధ్యవర్తితో మాట్లాడుతుండగా కిడ్నాప్ ముఠా వచ్చి అపహరించింది. ఇదంతా ముందే పన్నిన కుట్ర అని అప్పుడు అర్థమైంది. ఈ వార్త బయిటకు వచ్చినా ఆ దేశంలో పెద్ద ప్రచారం కల్పించకుండా లోలోపలే ఆపరేషన్ పూర్తి చేసి సదరు రాజవంశ వారసుణ్ని స్వదేశం పంపించేశారు.శుభం! అయినా రచయిత కూడా కదా ఈ మాత్రం ముందు వెనకలు చూసుకోకుండా ఎలా వెళ్లారంటే ఆశ చెడ్డది కదా!