బాహుబలి సినిమా ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా స్టామినాను తెలియచేసేలా చేసింది. సినిమాను రాజమౌళి తెరకెక్కించిన తీరు ప్రభాస్, రానా, అనుష్క, తమన్న, సత్య రాజ్ ల పాత్రల పర్ఫార్మెన్స్ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశాయి. అయితే అదే క్రేజ్ తో మొన్న దసరా నాడు మా టివిలో టెలికాస్ట్ అయిన బాహుబలి సినిమా కూడా మంచి టి.ఆర్.పి రేటింగ్ సంపాధించింది. బాహుబలి సినిమా టి.ఆర్.పి రేటింగ్ ప్రకారం 21.84 రేటింగ్ సాధించి మరో రికార్డుని క్రియేట్ చేసింది. అయితే అంతకుముందు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ టెంపర్ 26.5 టి.ఆర్.పి రేటింగ్ తో ముందంజలో ఉండగా. బాహుబలి దసరనాడు ఆ రికార్డుని బ్రేక్ చేస్తుంది అనుకోగా సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే దీపావళి పండుగ పురస్కరించుకుని శ్రీమంతుడు సినిమా ఈ నెల 8న బుల్లితెరలో సందడి చేసింది.. అయితే అనుకున్నట్టుగా అభిమాన నీరాజనాల నడుమ శ్రీమంతుడు సినిమాకు బుల్లితెర మీద కూడా విశేష ఆదరణ లభించింది. తెలుస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా బాహుబలి టి.ఆర్.పి రేటింగ్ రికార్డుని బ్రేక్ చేసిందని అంటున్నారు. జీ తెలుగులో ప్రసారమైన శ్రీమంతుడు సినిమాకు 22.04 రేటింగ్ ని సంపాధించుకుందట.
అంటే టి.ఆర్.పి రేటింగ్స్ ప్రకారం శ్రీమంతుడు బాహుబలి రికార్డులను క్రాస్ చేసిందన్నమాట. రీసెంట్ గా 100 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా బుల్లితెరలో ఈ రేర్ రికార్డుని సాధించినందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారు.