హీరోలు అప్పుడప్పుడు `హీరోయిన్లు`గా మారిన వైనం చూస్తూనే ఉన్నాం. చిత్రం భళారే విచిత్రం, మేడమ్, భామనే సత్యభామనే… ఇలాంటి కథలకు స్ఫూర్తి. ఇప్పుడు హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి కూడా ‘ఆడంగి’ వేషం వేసేశాడు. ‘జంబలకిడి పంబ’ సినిమా కోసం. ఈ వారమే విడుదల కానుంది. మరి ఆడవేషం వేయడం, లిప్ స్టిక్ పూసుకుని వయ్యారాలు పోవడం కష్టమనిపించలేదా? ఈ పాత్రకు స్ఫూర్తి ఎవరు? ఎవరిని అనుకరించారు? అని అడిగితే ‘చంటబ్బాయ్’లో చిరంజీవి పేరు చెప్పాడు శ్రీనివాసరెడ్డి. ఆ సినిమాలో చిరు ఓ పాటలో ఆడవేషం వేశాడు. చిరు… అలా కనిపించడం అదే మొదటిసారి.. అదే చివరిసారి కూడానూ. ”నరేష్, రాజేంద్ర ప్రసాద్‌లు నటించిన సినిమాలు కూడా చూశా. వాళ్ల నటన స్ఫూర్తిగా తీసుకున్నా. ఆడవేషం వేయడం నిజంగా కష్టమే. నలుగురి మధ్య చుడీదార్లు వేసుకుని నడవడం సిగ్గుగా అనిపించింది. మా ఇంట్లోవాళ్లయితే నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు. మా అమ్మాయి `మన ఇంట్లోకి మరో ఆడ మనిషి వచ్చిందం`టూ కామెంట్లు చేస్తోంది” అంటున్నాడు. హీరోగా మారిన తరవాత శ్రీనివాసరెడ్డి చేసిన మూడో సినిమా ఇది. `గీతాంజలి` మంచి విజయాన్నే అందించింది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమా బాగానే ఉన్నా అనుకున్న ఫలితం రాలేదు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో..?