నితిన్ కొత్త సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ టైటిల్లో ట్రెడిషనల్ ఫీల్ వుంది. పెళ్ళికొడుకుగా నితిన్, పెళ్లికూతురిగా రాశి ఖన్నాలను చూస్తుంటే భలే ముద్దొస్తున్నారు. టైటిల్, స్టిల్స్ పక్కా ట్రెడిషనల్ అనుకుంటే… టీజర్‌ని మస్త్ మోడ్రన్‌గా కట్ చేశారు. అందులో “ఈవెనింగ్ నాకు మీ టైమ్ ఓ టు అవర్స్ అప్పుగా కావాలి” అని నితిన్ చెప్పే డైలాగ్ యూత్‌ని అట్ట్రాక్ట్ చేస్తోంది. పెళ్లి విశిష్టత, పెళ్లిలోని గొప్పదనం వంటి అంశాల నేపథ్యంలో తీసిన సినిమా అయినా… ‘శ్రీనివాస కళ్యాణం’లో రొమాంటిక్ లవ్ ట్రాక్ కూడా వుందట. సిటీ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ సీన్స్ తెరకెక్కించారు. సిటీలో నితిన్ ‘ఆర్కిటెక్ట్’గా కనిపించనున్నాడు. వృత్తిరీత్యా ‘ఆర్కిటెక్ట్’ అయిన యువకుడు ఓ కాఫీ షాపులో పనిచేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అసలు, ఆ అమ్మాయి కాఫీ షాపులో ఎందుకు పనిచేస్తుంది? తరవాత వీళ్ల ప్రేమ పెళ్లి పీటల మీదకు వెళ్ళేమధ్యలో ఏం జరిగింది? అనేది సినిమా. పెళ్లిలోని గొప్పతనాన్ని ఏదో క్లాస్ పీకినట్టు కాకుండా ప్రేక్షకులంతా ఆసక్తిగా చూసేలా… ఒక వేడుకలా దర్శకుడు సతీష్ వేగేశ్న చూపించార్ట.