మలయాళ నటుడు రచయిత దర్శకుడు శ్రీనివాసన్ ముక్కుసూటిగా మాట్లాడటంలో చాలా ఫేమస్. ఆయన చేసే వ్యాఖ్యలు చాలా సార్లు వార్తల్లోకి ఎక్కాయి. తాజాగా ఆయన మలయాళం సూపర్‌స్టార్ మెహన్ లాల్ పైకొన్ని సంచలన కామెంట్స్ చేశారు. మోహన్ లాల్ పై మోసగాడనే ముద్ర వేశారు. అంతేకాదు తాను చనిపోయేలోపు అతని పూర్తి బండారం బయటపెడతానని చెప్పారు.
ప్రేమ్ నజీర్ ని మోహన్ లాల్ మోసగించాడని, అతను చెప్పిన కథ కాదని, ఇదే కథాంశంతో తర్వాత ‘సందేశం’గా రూపొంచారని, మోహన్‌లాల్ నిశ్చితార్థానికి ముందు తనకు ప్రేమ్ నజీర్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడని, కానీ కొన్ని రోజుల్లోనే ఆయన మరణించాడని చెప్పారు.
అయితే ప్రేమ్ నజీర్ సినిమాలో తాను నటించాలనుకున్నట్లు ప్రముఖ వార్తాపత్రికతో మెహన్ లాల్ చెప్పుకున్నాడని, ఈ వార్తలు చూసి అయ్యానని అన్నారు. దీనిపై ప్రేమ్ నజీర్ కొడుకు స్పందిస్తూ.. మా నాన్న మోహన్ లాల్ తో సినిమా చేయాలని అనుకున్న మాట వాస్తవమే.. అయితే శ్రీనివాసన్ ఇంత స్పష్టంగా చెబుతుంటే ఆయన మాటల్ని కొట్టిపారేయలేని చెప్పడం ఆసక్తికరంగా వుంది.