కామెడీని పండించడంలో శ్రీనువైట్లది సెపరేట్ స్కూల్. దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది ఎంటర్టైన్మెంట్ సినిమాల వల్లే. ‘దూకుడు’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన రికార్డ్ శ్రీనువైట్లకు ఉంది. అయితే… కొంతకాలంగా వైట్లకు హిట్లు దక్కడం లేదు. తీసిన సినిమా ఫ్లాపై కూర్చొంటోంది. ఒకప్పుడు బడా బడా హీరోలు శ్రీనువైట్ల వెనుక తిరిగే వారు. ఇప్పుడు శ్రీనుకి హీరోలు దొరకడమే కష్టమైపోతోంది. ఇలాంటి తరుణంలో గోపీచంద్ తో ఓ సినిమా తీస్తున్నాడు శ్రీనువైట్ల. అదే.. ‘విశ్వమ్’.
గోపీచంద్ – శ్రీనువైట్ల.. ఇద్దరూ రెండు భిన్న ధృవాలే. గోపీచంద్ పైయాక్షన్ ఇమేజ్ ఉంది. గోపీచంద్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాడు కానీ, తనని యాక్షన్ హీరోగానే చూస్తారంతా. శ్రీనువైట్ల ఎలాంటి సినిమా చేసినా అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. విశ్వమ్ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే… సినిమా పూర్తిగా యాక్షన్ తో నింపేసినట్టు కనిపిస్తోంది. గోపీచంద్ కోసం శ్రీనునే తన స్టైల్ మార్చాడనిపిస్తోంది. ఓరకంగా ఇది మంచిదే. హీరో బాడీ లాంగ్వేజ్‌ని బట్టి, కథలు రాసుకొంటే మంచి ఫలితాలొస్తాయి. కాకపోతే… శ్రీనువైట్ల సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ ఆశించి వెళ్తారు. `అమర్ అక్బర్ ఆంటోనీ` ఫ్లాప్ అవ్వడానికి కారణం.. శ్రీను మార్క్ కామెడీ లేకపోవడమే. మరి ఈసారి ఏం రిజల్ట్ వస్తుందో చూడాలి.