స్టార్ డైరక్టర్ శ్రీనువైట్లకు ఒకప్పుడు ఉన్నత ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదన్న విషయం అందరికి తెలిసిందే.. స్టార్ హీరోలెవరు అవకాశాలు ఇవ్వడానికి సాహసించని పక్షంలో తానో మిడిల్ రేంజ్ హీరోతో సినిమా చేస్తున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా ఓకే చేసిన శ్రీనువైట్ల సినిమా కూడా చాలా తక్కువ బడ్జెట్ లో తీస్తున్నట్టు తెలుస్తుంది. కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసిన శ్రీనువైట్ల ఇప్పుడు మిడిల్ బడ్జెట్ తో ఎలా తీస్తాడో చూడాలి.
అయితే సినిమా బడ్జెట్టే కాదు సినిమాకు శ్రీనువైట్ల తీసుకునే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఉందని తెలుస్తుంది. స్టార్ హీరోల సినిమాలు తీసేప్పుడు 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ తగ్గించుకున్న శ్రీనువైట్ల ప్రస్తుతం మార్కెట్ లేని ఈ సమయంలో కేవలం కోటి రూపాయలను మాత్రమే తీసుకోనున్నాడని తెలుస్తుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో మొదలవనున్నట్టు సమాచారం. అయితే స్టార్ డైరక్టర్ గా క్రేజ్ మీదున్న శ్రీనువైట్ల మరి ఇంత చీప్ అవ్వడానికి తన సినిమాల అపజయాలే కారణం. మరి వచ్చిన ఈ అవకాశాన్నైనా శ్రీనువైట్ల సద్వినియోగపరచుకుంటాడో లేదో చూడాలి.