మిస్టర్ సినిమా భారీ నష్టానికి జవాబు చెప్పాల్సిందేనని ఆ చిత్ర నిర్మాత ఠాగూర్ మధు.. దర్శకుడు శ్రీనువైట్లపై ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం దాదాపు పరిష్కారమైపోయినట్టే అని టాక్. తన పారితోషికం నుంచి రూ.85 లక్షలు తిరిగి ఇవ్వడానికి శ్రీనువైట్ల ఓకే అన్నాడట. దాంతో ఈ ఇష్యూకి పుల్‌స్టాప్ పడిపోయిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. మిస్టర్ కోసం అప్పట్లో శ్రీనువైట్ల ఎలాంటి పారితోషికం తీసుకోలేదని వార్తలొచ్చాయి. కానీ.. శ్రీనువైట్లకు రూ.3 కోట్ల పారితోషికం అందిందట. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఈ పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తానని శ్రీనువైట్ల మాట ఇచ్చాడని, లేదంటే ఫ్రీగా ఓ సినిమా చేసి పెడతానని చెప్పాడని, మాట తప్పడంతో నిర్మాత ఫిల్మ్‌ఛాంబర్ మెట్లు ఎక్కాల్సివచ్చిందని తెలుస్తోంది. రూ.3 కోట్లు ఇచ్చే పొజీషన్లో నేను లేనని, రూ.85 లక్షలు ఇవ్వగలనని శ్రీనువైట్ల రాజీకి రావడంతో ఇష్యూకి ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టినట్టు టాక్. మిస్టర్ సినిమా పెట్టుబడిలో దాదాపు 60 శాతం నష్టాలొచ్చినట్టు స్పష్టం అవుతోంది. ఆ విలువ ఇప్పుడు రూ.85 లక్షలన్నమాట.