వరుస హిట్లు ఇచ్చిన శ్రీనువైట్ల.. ఇప్పుడు వరుస ఫ్లాపులను మోస్తున్నాడు. అయినా సరే, మళ్లీ తనదైన ముద్ర వేయడానికి తపన పడుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డబుల్ డోస్` అనేది ఉపశీర్షిక. విష్ణు కథానాయకుడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా మరో రెండు కథల్ని రెడీ చేశాడు. `డబుల్స్` అనే టైటిల్ తో శ్రీనువైట్ల ఓ స్టోరీ రాసుకున్నాడు. ఇదో మల్టీస్టారర్. ఇందులో ఇద్దరు హీరోలుంటారు. `డీ అండ్ డీ` కీ `డబుల్స్` కీ మధ్య మరో సినిమా ఉంటుంది. డబుల్స్ లో స్టార్ హీరోలే కనిపిస్తారని సమాచారం. అయితే ఇంత వరకూ.. ఆ హీరోలెవరన్నది తెలీదు. శ్రీనువైట్ల కూడా.. `హీరోల గురించి ఏం అనుకోలేదు. కథ అయితే రెడీగా ఉంది. డీ అండ్ డీ తరవాత.. మరో సినిమా ఉంటుంది. ఆ తరవాతే… డబుల్స్ సెట్స్‌పైకి వెళ్తుంది` అన్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో శ్రీనువైట్ల పై ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. మహేష్, చిరులతో శ్రీనువైట్ల ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడన్నది ఆ వార్తల సారాంశం. వాటిని కొట్టిపరేశాడు శ్రీనువైట్ల. `ఆ వార్తల్లో నిజం లేదు` అని క్లారిటీ ఇచ్చాడు.