శమంతకమణి, దేవదాస్ లాంటి చిత్రాలతో ఆకట్టుకొన్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడు శర్వానంద్ హీరోగా ఓ సినిమాని రూపొందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘BOB’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు ‘మనమే’ అనే మరో టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఈ రెండు టైటిల్స్‌లో ఒకటి ఖరారు చేయబోతున్నారు. ఓ బాబు చుట్టూ తిరిగే కథ ఇది. అందుకే ‘BOB’ అంటూ వెరైటీ టైటిల్ పెడదామనుకొన్నారు. అయితే తెలుగు టచ్ ఉండాలన్న ఆలోచనతో ‘మనమే’ అనే టైటిల్ ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ కథలో ఓ బాబు పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో శ్రీరామ్ ఆదిత్య తనయుడు నటిస్తున్నాడని తెలుస్తోంది. శ్రీరామ్ కు నాలుగేళ్ల ఓ బాబు ఉన్నాడు. తనతో ఆ పాత్ర చేయిస్తున్నాడట శ్రీరామ్. అలా… తనయుడ్ని వెండితెరకు పరిచయం చేసేస్తున్నాడు శ్రీరామ్. ఈ సినిమాపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీగా ఖర్చు పెడుతోందని తెలుస్తోంది. ఇప్పటికే రూ.50 కోట్ల బడ్జెట్ దాటేసిందని టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేయబోతున్నారు.