బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లోనే కాదు దేశ మంతా.. చెప్పాలంటే విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్స్ ఉంటారు. షారుఖ్ సినిమా రిలీజ్ అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా కలక్షన్స్ కుమ్మేయడం ఖాయం. ఇక సినిమా కనుక ఆడియెన్స్ కు కనెక్ట్ అయితే ఆ రేంజ్ వేరు. రెండు సంవత్సరాల క్రితం ‘హ్యాపీ న్యూ ఇయర్’ తొలిరోజు 44 కోట్ల కలక్షన్స్ సాదించి తన సత్తా చాటిన షారుఖ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ‘దిల్ వాలే’ సినిమాకు కూడా బాగానే వసూళ్లు రాబట్టాడు. అయితే ఈ రెండు సినిమాల కన్నా షారుఖ్ ఎంతో ఇష్టపడి చేసిన ఫ్యాన్ సినిమాకు చాలా తక్కువ కలక్షన్స్ రావడం విశేషం.
15వ తారీఖు రిలీజ్ అయిన షారుఖ్ ఫ్యాన్ సినిమా తొలిరోజు కేవలం 19 కోట్లు వసూళ్లనే రాబట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ టాక్ బ్యాడ్ గా వచ్చినా సరే తొలి రోజు 21 కోట్ల వసూళ్లను రాబట్టింది. మరి రోజు రోజుకు క్రేజ్ పెరిగిపోతున్న బాలీవుడ్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తమ స్టామినా చూపించలేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే దీనికి కారణం అమీర్ ఖాన్ దేశంలో అసహనం అనే మాట మాట్లాడినప్పుడు షారుఖ్ అతనికి సపోర్ట్ చేయడం లాంటివి కారణాలు అయ్యి ఉండొచ్చని అంటున్నారు. మరి కారణం ఏదైనా షారుఖ్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోకి అత్యంత ఘోరంగా తొలిరోజు కేవలం 19 కోట్లు మాత్రమే వసూళ్లు రావడం అనేది ఇప్పుడు బీ టౌన్ హాట్ టాపిక్ అయ్యింది. పోని మొదటిరోజు కన్నా రెండు మూడు రోజుల్లో కలక్షన్స్ ఏమన్నా పెరుగుతున్నాయా అంటే అది లేదు. మరి మంచి సినిమా తీసిన షారుఖ్ కు ప్రేక్షకులు ఇచ్చిన ఈ స్పందన ఏవిధంగా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి.