రాజమౌళి ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది. తనయుడు కార్తికేయ పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. కార్తికేయ – పూజా ప్రసాద్‌లకు ఈవారంలోనే పెళ్లి. జైపూర్‌లోని ఉదయ్ పూర్లో పెళ్లి వేడుక సిద్ధమైంది. రేపు (గురువారం) కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్ బయలుదేరనున్నారు. మరోవైపు కొత్త యేడాది సంబరాలు కూడా మొదలైపోతున్నాయి. పెళ్లయ్యాక… డిసెంబరు 31 వేడుకలు కూడా జైపూర్‌లోనే చూసుకుని, 2న హైదరాబాద్ తిరిగొస్తారు. ఇక్కడికి వచ్చాక… సినీ, రాజకీయ ప్రముఖులకు వివాహ విందు ఇవ్వబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ పెళ్లి హడావుడి వల్లే ఆర్.ఆర్.ఆర్, ఆకాశవాణి చిత్రాల పనులకు బ్రేక్ పడింది. సంక్రాంతి పండగ కూడా ముగిశాకే… ఈ సినిమాల కొత్త షెడ్యూళ్లు మొదలవుతాయి.