మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున పుణ్య స్నానాలకు తరలి వచ్చిన చోట తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామునే ఈ ఘటన జరిగింది. అయితే ఎంత మంది చనిపోయారు.. ఎంత మంది గాయపడ్డారు అన్న విషయాలపై విస్తృత ప్రచారం జరిగితే మరింత గందరగోళం ఏర్పడుతుందని యూపీ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. రూమర్స్ ప్రచారం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. సమాచారాన్ని గోప్యంగా ఉంచింది. అయితే వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. మరో చోట జరగకుండా అలర్ట్ ప్రకటించారు.
మౌని అమావాస్య సందర్భంగా కోటి మందికిపైగా పుణ్యస్నానానికి వస్తారని అంచనా. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. అయితే ఎక్కడో ఓ చోట కొంత మంది నిర్వహణ అధికారుల నిర్లక్ష్యమో.. భక్తుల తొందరపాటు తనం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా జరగకూడదని యూపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అయితే సంఘం ఘాట్ వద్ద పరిస్థితి అదుపు తప్పింది. ఈ వ్యవహారం తర్వాత పరిస్థితి అదుపు తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో వేగంగా స్పందించింది.
భక్తులు స్నానమాచరించి వెంటనే వెళ్లిపోవాలని ఆలయాల్లోకి ప్రవేశం లేదని ప్రకటించింది. ప్రధాని మోదీ కూడా విషయం తెలిసినప్పటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి మోదీ ప్రయాగరాజ్ లోనే ఉండి అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు.