వైజాగ్ పెట్టుబడిదారుల సదస్సును వైసీపీ ప్లీనరీ నిర్వహించినట్లుగా నిర్వహిస్తున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులకు మాత్రమే ప్రవేశం కాకుడా.. పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పుకోవడానికన్నట్లుగా ఇష్టా రీతిన పార్టీ సానుభూతిపరులకు కూడా పాసులు ఇచ్చారు. ఇలాపెద్ద ఎత్తునరావడంతో..ప్రభుత్వం ఇన్వెస్టర్స్ కోసం రెడీ చేసిన కిట్ల కోసం తోపులాట జరిగింది. తక్కువగా ఉండటంతో వచ్చిన వాళ్లంతా ఎగబడి తమకు దొరికిన కిట్లను పట్టుకుపోయారు. దీంతో ఆ కిట్లు ఉంచిన స్టాల్స్ అన్నీ విరిగిపోయాయి. గందరగోళం ఏర్పడింది.
భోజనాల దగ్గర కూడా అదే పరిస్థితి. పరిమితంగా భోజనాలు ఏర్పాటు చేయడంతో.. పెట్టుబడులకు సంబంధం లేని వారు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ముందుగానే భోజనాలు పూర్తి చేసేశారు. దీంతో చాలా మందికి ఆకలితో అలమటించారు. వారి కోసం వాలంటీర్లు, పోలీసులు, అధికారులపై చూపించారు. భోజనాలు ఎందుకు లేవని ఆగ్రహించారు. వారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మొత్తంగా రూ. రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు బాగా చేసినప్పటికీ.. దీన్ని వైసీపీ ప్లీనరీ, బహిరంగసభ తరహాలో చేయడంతో మధ్యాహ్నానికి గాడి తప్పింది.
మరో వైపు పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించడం.. ఇతర కార్యక్రమాలేమీ పెద్దగా కనిపించలేదు. వస్తారా.. ముందుగానే మాట్లాడుకున్నట్లుగా సంతకాలు పెట్టుకుని వెళ్తారా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కోట్ల ను దోచుకున్న వ్యవహారం… భోజనాల వివాదం..సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.