నాటు నాటు.. ఆస్కార్ స్టేడియాన్ని ఊపేసింది. అతిథులు, హాలీవుడ్ స్టార్లు అంతా… నాటు నాటు పాటకు ఫిదా అయిపోయారు. ఆస్కార్ వేదికపై.. `నాటు.. నాటు` లైవ్ పెర్‌ఫార్మ్సెన్స్ కలిగించిన అనుభూతి. ఈ పాటని ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. వెనుక… గ్రూప్ డాన్సర్లు రంగు రంగుల కాస్ట్యూమ్స్ వేసుకొని… అదిరిపోయే స్టెప్పులు వేశారు. నాటు నాటు పాటకే తలమానికం అయిన హుక్ స్టెప్ని అచ్చుగుద్దినట్టు దింపేశారు. ఎన్టీఆర్,చరణ్ నాటు నాటు పాటలో ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొన్నారో.. అలాంటి డ్రస్సులతోనే డాన్సర్లు మెరరవడం.. అచ్చుగుద్దినట్టు దింపేశారు. పాట ప్రదర్శిస్తున్నప్పటి నుంచీ.. ముగిసిపోయేంత వరకూ చప్పట్ల జాతర కొనసాగుతూనే ఉంది. పాట అయిపోయాక.. స్టాండిగ్ అప్లాజ్ వచ్చింది. ఓ తెలుగు పాట.. ఆస్కార్ స్థాయికి వెళ్లడం, అక్కడ ప్రదర్శింపపడడం.. దానికి ఇలాంటి అపూర్వమైన స్పందన రావడం దేశమంతా, ముఖ్యంగా తెలుగువాళ్లంతా గర్వించదగిన పరిణామం.
ఈ పాటని ఆస్కార్ ఆడిటోరియానికి.. పరిచయం చేసే అవకాశం.. దీపిక పదుకొణేకి దక్కింది. `మీకు నాటు అంటే ఏమిటో తెలుసా.. తెలియకపోతే.. ఇప్పుడు చూడండి` అంటూ కాలభైరవ, సిప్లిగంజ్ అండ్ టీమ్‌ని వేదికపై ఆహ్వానించింది దీపిక పదుకొణె. ఆస్కార్ పురస్కారాలకు దీపిక ఓ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది ఈ అవకాశం దక్కించుకొన్న ఏకైక నటి… దీపిక కావడం విశేషం.