రాక రాక ఎన్నికల నోటిఫికేషన్ వస్తేతీరా ప్రచారం చేసుకోవాలనుకునే సరికి పండగులు వచ్చి పడుతున్నాయి. దీంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులు స్టార్ క్యాంపెయినర్లు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ టైం పాస్ చేస్తున్నారు. అనని పార్టీలకు తాడో పేడో అన్నట్లుగా మారిపోయిన హుజురాబాద్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ కనిపించడం లేదు. అభ్యర్థులు… వారి వారి క్యాడర్‌తోనే తిరుగుతున్నారు. దసరా పండుగ సందడి అయిపోతేనే ముఖ్య నేతలు వస్తారని అనుకుంటున్నారు.
టీఆర్ఎస్ తరపున పండగులు. .సెలవులు ఏమీ లేకుండా హరీష్ రావు ఒక్కరే గల్లీ గల్లీ తిరుగుతున్నారు. స్టార్ క్యాంపెయినర్ల పేరుతో 20 మంది జాబితా విడుదల చేశారు కానీ అది పేరుకే. కేటీఆర్, కేసీఆర్ ప్రచారానికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. చాలా చిన్న ఎన్నిక అనికేటీఆర్ పదే పదే తీసేస్తున్నారు. కానీ హరీష్ కు మాత్రం తాడో పేడో అన్నట్లుగా మారిపోయింది. ఇక బీజేపీ నేత ఈటల పరిస్థితి ఆయనకే అర్థం కావడం లేదు. బండి సంజయ్ కూడా ప్రచారానికి రావడం లేదు. నామినేషన్‌కు వచ్చిన నేతలు తర్వాత కనిపించకుండా పోయారు. బండి సంజయ్ దుర్గా దీక్ష తీసుకున్నారు. జాతీయ నేతలు వస్తారోలేదో క్లారిటీ లేదు. కనీసం విజయశాంతితో అయినా ప్రచారం చేయించుకుందామన్నా… పరిస్థితి అనుకూలంగా లేదు.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతే. అభ్యర్థిగా బలమూరి వెంకట్‌ను నిర్ణయించడం వెనుక వ్యూహం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతూండటంతో ఆపార్టీకి ఇబ్బందికరంగా మారింది. జాతీయ నేతలు ఎవరూ వచ్చే పరిస్థితిలేదు. ఆ పార్టీలో క్రౌడ్ పుల్లర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. ఆయనే ప్రచార బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. కానీ పీసీసీ చీఫ్ గా అన్ని బాధ్యతుల చూసుకోవాల్సి రావడంతో ఎంత సమయం కేటాయిస్తారన్నది సస్పెన్స్ గానే మారింది. మొత్తానికి దసరా తర్వాత ఓ వారం.. పది రోజులు మాత్రమే ప్రచార హోరు సాగే అవకాశం కనిపిస్తోంది.