సినిమా నిర్మాణంలో దర్శకుల బాధ్యత ఎంత ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే.. అయితే దర్శకుడు సినిమాకు తన సహకారాన్ని అందించాలి కాని సినిమాకు భారం కాకూడదు.. ఓ స్టార్ హీరో సినిమా బడ్జెట్ ఎంతా..? అని లెక్కలేస్తే దానిలో హీరో దర్శకుడి పారితోషికాలే సగం బడ్జెట్ ఆక్రమించేస్తున్నాయి. అందుకే స్టార్ హీరోల మనసు మార్చుకున్నారు. కొత్త దర్శకుల వైపు వీరి ఆలోచనలు వెళ్తున్నాయి. స్టార్ హీరోల మాదిరి దర్శకుల పారితోషికం కూడా పెంచడంతో సినిమా తేడా కొడితే నిర్మాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
అయితే స్టార్ డైరక్టర్ అంటే సినిమా ఓ కచ్చితమైన నమ్మకం ఉంటుంది అన్న ఆరోపణలు వస్తున్నా.. సినిమా కథ కథనాలు.. స్టార్ హీరోను సరిగా స్క్రీన్ మీద చూపించగలిగే సత్తా ఉన్న కొత్త దర్శకుడైనా చాలు సినిమా హిట్ మార్క్ టచ్ చేయడానికి అనేది మరో వైపు వినిపిస్తున్న మాట. ప్రస్తుతం స్టార్ దర్శకులుగా రాజమౌళి, వినాయక్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, సుకుమార్, త్రివిక్రం తమ హవా కొనసాగిస్తున్నారు. వీరితో సినిమా అంటే దాదాపు హిట్ అన్నట్టే కాని ఫట్ అయితే మాత్రం సినిమా నిర్మాత ఎలా ఉన్నా హీరో ఎకౌంట్ లో ఫ్లాప్ వచ్చి పడుతుంది. అందుకే స్టార్ హీరోలు తమ పంథా మార్చుకుని రచయితలనుండి దర్శకులుగా మారిన వారితో సినిమాలు చేస్తున్నారు.
ఈ కోవలో శ్రీకాంత్ అడ్డాలతో సూపర్ స్టార్ మహేష్ ‘బ్రహ్మోత్సవం’ చేస్తుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న బాబితో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే రచయిత నుండి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మారిన కొరటాల శివతో కూడా సినిమాలు చేసేందుకు హీరోలు క్యూ కడుతున్నారు. సర్దార్ తర్వాత పవన్ కళ్యాన్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని అంటున్నారు.
అయితే స్టార్ హీరో తమ మీద నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేలా కొత్త దర్శకులు కష్టపడుతున్నారు. ఇక ఇక్కడ గమనించాల్సిన మ్యాటర్ ఏంటంటే ఒక్క సినిమా స్టార్ హీరోతో హిట్ కొడితే వీరు కూడా భారీగా పారితోషికం పెంచే అవకాశం ఉంది.