ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూసిన నాగచైతన్య – సమంతల రిసెప్షన్ జరిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వివాహ విందు ఇచ్చేసింది ఈ కొత్త జంట. మీడియాకు ప్రత్యేకంగా ఆహ్వానాలు రావడం, ఈ విందులో పాత్రికేయులకు కాస్త ప్రత్యేక స్థానం కల్పించడం నాగ్‌కి ‘మీడియా’పై ఉన్న గౌరవాన్ని తెలియజేసింది. మీడియా మిత్రులందరితోనూ, సమంత, చైతూ ఓపిగ్గా ఫొటోలకు పోజులివ్వడం కనిపించింది.
స్టార్స్ మెరిసినా ముఖ్యమైన వాళ్లు విందులో కనిపించకపోవడం కాస్త చర్చనీయాంశమైంది. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ … వీళ్లంతా ఈ విందులో కనిపించలేదు. వీళ్లంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నా, కొంతమంది హైద్రాబాద్ లోనే ఉన్నారు. పైగా రెండో ఆదివారం షూటింగులకూ సెలవు. అయినా… ఎందుకు రాలేదో? నందమూరి బాలకృష్ణ కూడా కనిపించలేదు. ఆయనకు ఆహ్వానం అందిందా, లేదా?? అనే విషయంలో మరోసారి చిత్రసీమలో చర్చ మొదలైంది. మీడియా కవరేజీకి అవకాశం ఇవ్వకపోవడం, స్టిల్స్ కొన్ని మాత్రమే బయటకు విడుదల చేయడంతో రిసెప్షన్ సంగతులేవీ పూర్తి స్థాయిలో బయటకు రాలేదు.