హైదరాబాద్: బీహార్ అసెంబ్లీకు జరిగిన హోరా హోరీ యుద్ధం ముగిసి ఫలితాలు ఆవిష్కృతమయ్యాయి. దీంతో విజేతలకు అభినందనలు, పరాజితుల అపజయానికి కారణాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడి మహాకూటమి నితీష్ కుమార్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా మహాకూటమి నేతలను అభినందించారు. బీహార్ ప్రజల తీర్పును గౌరవిస్తామని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా సోషల్ మీడియాలో నితీష్‌ను అభినందించారు.
రాహుల్ గాంధి – మహాకూటమి విజయం విఛ్చిన్నకరశక్తులపై సమైక్యతకు లభించిన విజయం. దురహంకారంపై వినయం విజయం.
మమతా బెనర్జీ – అసహనానికి పరాజయం, సహనానికి విజయం.
శివసేన – నితీష్ హీరోగా అవతరించారు. ఓటమికి మోడి బాధ్యత తీసుకోవాలి.
ఓవైసీ – బీహార్ ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయాం. ఆత్మపరిశీలన చేసుకుంటాం.
చిదంబరం – తప్పుడు వ్యాఖ్యలు చేసిన నాయకులపై మోడి చర్యలు తీసుకుని ఉండాల్సింది.
చిరాగ్ పాశ్వాన్ – నితీష్ చేసిన పనులకు ఫలితం లభించింది.
అఖిలేష్ యాదవ్ – ఇది చరిత్రాత్మక విజయం.
శతృఘ్న సిన్హా – ఫలితం ఇలా వస్తుందని ముందునుంచీ తెలుస్తూనే ఉంది.
కేజ్రీవాల్ – ప్రజలు ద్వేష రాజకీయాలను తిప్పికొట్టారు