వైరస్ దెబ్బకు మళ్లీ షట్‌డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించేసింది. అక్కడ ఇప్పటికే వారంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. అయినా.. అనూహ్యంగా.. రోజు రోజుకు రికార్డు స్థాయి కేసులు నమోదవుతూండటంతో… కంప్లీట్ లాక్ డౌన్ వైపు కర్ణాటక ఆలోచనలు చేసింది. బెంగళూరులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మరింత పెరగకుండా ఉండాలంటే.. జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్ కూడా.. భారీగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కట్టడి చర్యలను ప్రకటించాయి. లాక్ డౌన్‌ను పాక్షికంగా అమలు చేస్తున్నాయి.
ఉత్తరాది ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తున్నాయి. నిజానికి బెంగాల్, పంజాబ్, అసోం లాంటి రాష్ట్రాలు… కేంద్రం ఇస్తున్న అన్‌లాక్ నిబంధనల సడలింపులను పట్టించుకోకుండా.., సొంతంగా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా కొన్ని చోట్ల.. కరోనా వైరస్ కట్టడి అవుతోంది కూడా. కానీ.. ఆర్థిక వ్యవస్ధ కుంగిపోతోందంటూ… కేంద్రం ఇచ్చిన రిలాక్సేషన్స్ను యథావిధిగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో మాత్రం.. పరిస్థితి దిగజారిపోతోంది. కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ.., రోజుకు .. రెండు వేల కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం మాత్రం.. అన్ లాక్ సీజన్ ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. కొత్తగా భారీగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో.. ఆయా రాష్ట్రాలు సొంతంగా ఆంక్షలు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ ప్రకారం.. రాష్ట్రాలదే నిర్ణయం అయిపోయింది. ప్రజారోగ్యంపై.. ఎక్కువ దృష్టి పెట్టిన ప్రభుత్వాలు.. కట్టడి చర్యలపైనా ఆలోచనలు చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ.. ఆదాయంపై దృష్టి పెట్టిన ప్రభుత్వాలు… మొత్తం లైట్ తీసుకుంటున్నాయి.