మాచర్లలో పట్ట పగలు ఇద్దరు ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతలై హత్యాయత్నం చేస్తే… వీడియో సాక్ష్యాలతో సహా దొరికితే.. ఆ క్రిమినల్‌కు ఏపీ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ప్రాణభయంతో లాడ్జిలో దాక్కుని ఉన్న సుబ్బారావు గుప్తా అనే వ్యక్తిని పట్టుకుని… చంపేస్తానంటూ బాదేసిన వ్యక్తికీ స్టేషన్ బెయిలే ఇచ్చారు. గుప్తాపై దాడి చేసిన రౌడీషీటర్ సుభాని ఒంగోలులో నిన్నరాత్రి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఆ వెంటనే ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడం.. పోలీసులు… వ్యవస్థ పని చేస్తుందా.. లేదా అన్న విమర్శలు రావడంతో అప్పటికప్పుడు కేసు నమోదు చేశారు.
కానీ సుభానిని పట్టుకునేంత ధైర్యం చేయలేదు. చివరికి అరెస్టు చేయలేదని ఆర్యవైశ్య సంఘాలు కూడా ఆందోళన నిర్వహించడంతో చివరికి ఆయనను బతిమిలాడి… స్టేషన్‌కు పిలిపించుకుని అరెస్ట్ చూపించారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి సగౌరవంగా పంపేశారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. చంపేస్తానని బెదిరిస్తూ.. దారుణంగా కొట్టిన దృశ్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి..ఇలాంటి సమయంలో సుభానిపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిఉంటుంది. కానీ అలాంటిదేమీ చేయలేదు.
ఏపీలో పోలీసు వ్యవస్థ .. రెండు ప్రత్యేక రాజ్యాంగాలను అమలు చేస్తోంది. వైసీపీ నేతలకు ఒకటి.. విపక్ష పార్టీలకు.. సామాన్యులకు ఇంకొకటి. ఈ పరిస్థితి సామాన్యుల్లో భయాందోళనలకు కారణం అవుతోంది. రాష్ట్రంలో స్వేచ్చా స్వాతంత్రాలు లేవని పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ నేతలు ఎవర్ని కొట్టినా తిట్టినా చర్యలేమీ ఉండవు కానీ.. ఇతరులు సోషల్ మీడియా పోస్టులు పెట్టినా అర్థరాత్రి అరెస్టులు చేస్తారన్న ఓ భావన పోలీసులపై ఏర్పడింది.