చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ దసరాకి వస్తోంది. ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ గాడ్ ఫాదర్ ఆఫర్ గురించి ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. ఈ కథ స్వయంగా చిరునే సత్యదేవ్ కి చెప్పారట. చిరంజీవి అన్నయ్య ఒక షూటింగ్ లో లంచ్ కి రమ్మని పిలిస్తే వెళ్లాను. ఒక సినిమా ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. నేను షాకింగా చూస్తున్నాను. అన్నయ్య నాకు కథ చెప్పడం ఏమిటని ఆశ్చర్యంగా చూస్తున్నాను. నేను ఎప్పుడూ కలలో కూడా కనని వింత అనుభవం అది. నేను ఆయనకి వీర అభిమానిని, నేను గురువు భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నాకు కథ, పాత్ర చెప్పడం ఆశ్చర్యమనిపించింది.
ఆయన నా వంక చూసి ”నేను సరిగ్గా కథ చెప్పడం లేదా ? పోనీ దర్శకుడితో చెప్పించనా ?” అని అడిగారు. ”మీరు నాకు కథ చెప్పడం ఒక కలలా వుంది, నాకేం అర్ధం కావడం లేదనయ్యా.. మీరు చేయమని చెప్తే చేసేస్తాను.. మీరు కథ చెప్పడం ఏంటి ” అన్నాను. సినిమా చూశావా ? అని అడిగారు. ”చూడలేదు, చూడను కూడా. చేసేస్తాను” అని చెప్పా. ఆయన అడిగిన తర్వాత మళ్ళీ చూసే ఆలోచనే లేదు. ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. అయితే పాత్ర చేస్తున్నపుడు అందులో వున్న లోతు కొంచెం కొంచెం అర్ధమైయింది. తర్వాత చిన్న టెన్షన్ కూడా మొదలైయింది” అంటూ గాడ్ ఫాదర్ ఆఫర్ మూమెంట్ గురించి చెప్పుకొచ్చారు సత్యదేవ్.