స్టీల్ ప్లాంట్ కష్టాలు తీరాలంటే భూములు అమ్మాలని సీఎం జగన్ రెడ్డి మోదీకి సలహా ఇచ్చారు. ఆ సలహాల సంగతేమిటో కానీ… స్టీల్ ప్లాంట్ మాత్రం ఉక్కు భూములు అమ్మడానికి ప్రయత్నిస్తోంది. స్టీల్‌ప్లాంటు నిధుల సమీకరణకు వెయ్యి ఎకరాలు అమ్మేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం స్టాక్‌యార్డు కోసం మాత్రం భూములు అవసరమని, సుమారుగా 1,000 ఎకరాలు కావాలని స్టీల్‌ప్లాంటు యాజమాన్యానికి ప్రతిపాదన పెట్టింది. ఇస్తారా లేదా అన్న విషయం సస్పెన్స్ లో ఉంది. ఎందుకంటే అదాన ీకంటే ముందే… కొన్ని సంస్థలు భూముల కోసం స్టీల్ ప్లాంట్ వెంట పడుతున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ విశాఖలో పెల్లెట్ ప్లాంటు, స్టాక్‌యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 1,000 ఎకరాలు అవసరం అని భావిస్తోంది. స్టీల్‌ప్లాంటులో తగిన భూములు కేటాయిస్తే అక్కడే పెల్లెట్ ప్లాంటు, స్టాక్‌యార్డు పెట్టుకుంటామని చెబుతోంది. దీనిపై స్టీల్ ప్లాంట్ అధికార వర్గాలు చ్రచలు జరుపుతున్నాయి. స్టీల్‌ప్లాంటుకు, ఎన్ఎండీసీకి ఒప్పందం కుదిరితే లీజుతో పాటు రూ.700 నుంచి రూ.800 కోట్ల నిధులు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. స్టీల్ తయారీకి పెల్లెట్లు కూడా అవసరమేనని, ఇప్పుడు అవసరమైన వాటిని స్టీల్‌ప్లాంటు కర్ణాటక నుంచి తెప్పించుకుంటోందని, ఎన్ఎండీసీ ఆ ప్లాంటు ఇక్కడే పెట్టుకుంటే రవాణా వ్యయాలు కలిసి వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కానీ ఆ భూముల కోసమే… అదానీ ఎంట్రీ ఇవ్వడంతో.. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రారంభమయింది. మరో వైపు సీక్రెట్ గా ఆ భూముల్ని ఆదానీకి ఇచ్చేశారని ఆరోపిస్తూ.. కేఏ పాల్ ఆమరమదీక్ష చేస్తానని చెబుతున్నారు. ఆ భూముల్ని ఆదానికి ఇచ్చినట్లుగా పాల్ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో కానీ.. ఈ వ్యవాహంర మాత్రం సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.