బుధవారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగబోతున్నాయి. పెట్రోల్ పై లీటరుకి రూ.3.07, డీజిల్ పై లీటరుకి రూ.1.90 ధర పెరిగింది. పెరిగిన ఈ ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయి. ఫిబ్రవరి 29న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పెట్రోల్ ధర కొంత తగ్గింది. మళ్ళీ ఇప్పుడు రెండింటి ధరలు ఒకేసారి పెరిగాయి. పెరిగిన కొత్త ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర కోల్ కతాలో రూ.63.76, ముంబైలో రూ. 65.79 అవుతుంది. పెట్రోలియం సంస్థలు విదేశీ మారక ద్రవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ నెల 1,16 తేదీలలో పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తుంటాయి. ఈ పెరుగుదల దానిలో భాగమే. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడవచ్చును.