మీకు నమ్మకమైన వ్యక్తి గురించి మీరు బహిరంగంగా చెప్పుకోవాలంటే .. అభిమానంతో సొంతంగా చెప్పుకుంటారు. కానీ బలవంతంగా ఆ వ్యక్తి తనపై అభిమానం చూపించు.. నీ నమ్మకం నేనే అని అని ముఖం మీద స్టిక్కర్ అంటించి.. అది ఉంచుకోవాల్సిందని హుకుం జారీ చేస్తే ఎలా ఉంటుంది ? . విచిత్రంగా ఉంటుంది . మీ నమ్మకాన్ని నేనేనని స్టిక్కర్ అంటించిన వ్యక్తి మానసిక స్థితిని తేడాగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీ ప్రజలు అలా చూడాల్సిన స్థితికి వెళ్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతీ ఇంటికి స్టిక్కర్ వేయాలని నిర్ణయించింది. మా నమ్మకం నువ్వే జగనన్నా పేరుతో ఈ స్టిక్కర్ తయారు చేశారు. వాలంటీర్లకు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందిన ప్రతి ఇంటికి ఈ స్టిక్కర్ ను అంటిస్తారు. ఇందు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా అ స్టిక్కర్ ను అంటించి వెళ్లిపోతారు. ఇటీవల ఇప్పటంలో ఇళ్లు కూల్చేసినా… మాకెంతో సంతోషం అని.. వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినట్లుగా అన్నమాట.
ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా ఇంటింటికి తిరగడమే కాకుండా… పాంప్లెట్లు పంచారు. ఏమేమి ఇచ్చారో లెక్క చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టిక్కర్లు తెస్తున్నారు. వీరి తీరు చూసి ప్రజలు కూడా ఒక్క రూపాయి ఇచ్చి ఇన్ని సార్లు చెబుతున్నారేంటి అనుకునే పరిస్థితి వచ్చింది. అయినా ప్రజల్లో నమ్మకం కలిగిస్తే… మనసుల్లో ఉంటారు కానీ.. ఇలా బలవంతంగా ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తే… అది అధికార దర్పం అవుతుంది కానీ.. అభిమానం కాదని వైసీపీ నేతలే చిరాకుపడాల్సిన పరిస్థితి వచ్చింది.