చేతిలో ఒక్క హిట్ లేదు. పెద్ద హీరోలతో సినిమాలేం చేయడం లేదు. కానీ ప్రగ్యా జైస్వాల్ మాత్రం యమ బిజీ. నక్షత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది ప్రగ్యా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ నటిస్తోంది. మంచు విష్ణు సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. మూడు సినిమాలతో తీరిక లేకుండా గడపుతున్నందుకు కొత్త సినిమాలేం ఒప్పుకోలేకపోతోందట. ఇటీవల రవితేజ సినిమాలో ప్రగ్యాకి ఛాన్స్ వచ్చిందని… కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ‘నో’ చెప్పేసిందని వినికిడి.
ఇంతా పోగేస్తే ప్రగ్యాకి ఒక్క హిట్ కూడా లేదు. తొలి సినిమా ‘మిర్చీ లాంటి కుర్రోడు’ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో ఎవ్వరికీ తెలీదు. ఆ తరవాత ‘కంచె’ బాగానే ఆడినా హిట్ అనిపించుకోలేదు. నమో వెంకటేశాయలో చిన్న పాత్రలో మెరిసింది ప్రగ్యా. ఆ సినిమా ఫట్టుమంది. కథానాయికల కొరత వల్ల, ఈ అమ్మడిలో అంతో ఇంతో టాలెంట్ ఉండడం వల్ల.. ప్రగ్యా వెనుక పడుతున్నారు దర్శక నిర్మాతలు. దాన్ని క్యాష్ చేసుకోవాల్సింది పోయి.. ‘కాల్షీట్లు లేవు’ అంటూ వెనక్కి తిప్పి పంపించేస్తే ఎలా?? అలా చేస్తే తప్ప తాను బిజీగా ఉన్నట్టు, పెద్ద హీరోయిన్ అయిపోయినట్టు ఇండ్రస్ట్రీ ఫీల్ అవ్వదని భ్రమ పడుతున్నట్టుంది.