హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దారుణంగా మట్టికరవటంతో ఆ ప్రభావం సహజంగానే స్టాక్ మార్కెట్‌పై పడింది. ఇవాళ ఉదయం ఓపెనింగ్ ట్రేడింగ్‌లో 600 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 7,800 కిందకు జారిపోయింది. మరోవైపు రూపాయి విలువ 1 శాతంపైగా పడిపోయి డాలర్ మారకపు విలువ రు.6650కు చేరింది. బీహార్ ఎన్నికలలో మోడి కూటమి విజయం సాధిస్తుందని కొద్దిరోజులుగా మార్కెట్లో అంచనాలు వేశారని, ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మోడి కూటమికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవటంతో, రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏకు మెజారిటీ లేనందున ఇప్పుడు మోడి చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వెనక్కు వెళ్ళిపోతాయేమోనని ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నారని అంటున్నారు. దివాళీ లక్ష్మీపూజ, దివాళీ బలిప్రతిపాద సందర్భంగా స్టాక్ మార్కెట్లు బుధవారం, గురువారం పనిచేయవు. అయితే బుధవారంమాత్రం ఒక్క గంటపాటు ముహురత్ ట్రేడింగ్ జరుగుతుంది.