రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి… పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత అక్కడ బొండా ఉమతో కలిసి తిరిగే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లతో స్టేట్మెంట్లు ఇప్పించి.. బొండా ఉమపై కేసులు పెట్టి ఆయనను ప్రచారానికి వెళ్లకుండా అరెస్టు చేసే ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా ఇప్పటికే లీకులు వచ్చాయి.
అసలు పోలీసుల సమక్షంలో ఎవరు ఇచ్చే స్టేట్మెంట్లకు విలువ ఉండదు. పోలీసులు కొట్టి తమకు కావాల్సినట్లుగా చెప్పిస్తారని కోర్టులకూ తెలుసు. అందుకే చట్టం ఒప్పుకోలేదు. అయినా రాజారెడ్డి రాజ్యంగంలో శిక్ష పడుతుందా.. కోర్టుల్లో నిలబడుతుందా అన్నది కాదు … అరెస్టు చేశామా.. జైల్లో పెట్టామా.. నీలి, కూలి మీడియాలో తప్పుడు ప్రచారం చేశామా అన్నదే కీలకం. అదే చేస్తున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు.
కానీ తప్పుడు పనులు చేసి ఎల్ల కాలం తప్పించుకుంటారని చెప్పలేరు. తెలంగాణలో జరుగుతోంది అదే. కేసీఆర్ బతికున్నంత కాలం ఆయనే సీఎం అని విర్రవీగి విచ్చలవిడిగా తప్పులు చేశారు అధికారులు. ఇప్పుడు అంతా జైళ్ల బాట పట్టారు. ఎన్నికలు ఉన్నందున కాస్త ఆగారు కానీ… ఎన్నికలైన తరవాత ఎంత మంది ఐఏఎస్, ఐపీఎస్ లు బలవుతారో తేలుతుంది. ఏపీలో అయితే.. అడ్డగోలు కుట్రలు చేసిన పోలీసులపై సాక్ష్యాలు బహిరంగంగానే ఉన్నాయి. ఎంత కాలం తప్పించుకోగలరు ?.
తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడన్నది చట్టంలో ఉండే ప్రధాన అంశం. ఆ విషయం తెలిసి కూడా పోలీసులు ఐదేళ్లుగా దారి తప్పారు. చివరికిలోనూ అదే జరుగుతోంది. తరవాత అలాంటి వాటికి వారు బలయ్యే వార్తలే హైలెట్ అవుతాయి. అప్పుడు ఎవరూ సానుభూతి కూడా చూపరు.