జగన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేశారని వైసీపీ ప్రారంభించిన క్షుద్ర రాజకీయం ప్రతిపక్ష నేతలపై ఉద్దేశపూర్వక రాళ్ల దాడులకు దారి తీస్తోంది. పోలీసు వ్యవస్త పూర్తి స్థాయిలో నిద్రాణంగా ఉండిపోతోంది. జగన్ రెడ్డిపై ఎవరు దాడి చేశారో ఎవరికీ తెలియదు. కనీసం పట్టుకునే ప్రయత్నం చేయలేదు. అదేదో సైబర్ దాడి అన్నట్లుగా ఏమీ తెలియనట్లుగా నిస్సహాయంగా ఉండిపోయింది యంత్రాంగం. కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేసి వారిపై రాళ్ల దాడులకు తమ కార్యకర్తలను ప్రోత్సహిస్తోంది.
తెనాలి పర్యటనలో ఓ వైసీపీ కార్యకర్త పవన్ కల్యాణ్ పై రాయి విసిరాడు. అదిదూరంగా పడింది. ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాజువాకలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఆయన వాహనం వెనుక గుండా వచ్చి దుండగులు రాళ్లు వేశారు. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు వాహనం వద్దకు పోలీసుల్ని దాటుకుని రాళ్లతో ఎలా వచ్చారన్నది పెద్ద సస్పెన్స్ మారింది. రాళ్లు వేసి పక్కా ప్లాన్ తో పక్క సందులోకి పారిపోయారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినట్లుగా షో చేశారు.
ప్రతిపక్ష నేతలపై ఉద్దేశపూర్వక దాడులకు వైసీపీ నేతలు ప్రోత్సహిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నా.. పోలీసుల వైపు నుంచి ఎలాంటి కఠిన చర్యలు కనిపించడం లేదు.. పూర్తి స్థాయిలో వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. తప్పుడు రాజకీయాలతో కోడికత్తి దాడులు.. రాళ్ల దాడులు చేయించుకుని ప్రత్యర్థులపై నిందలు వేసి వారిపై దాడులకు కుట్రలు చేయడం ఏపీ రాజకీయాల్లో కొత్త కాన్సెప్ట్ గా కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో .. ఇంకెన్ని జరుగుతాయోనని.. ప్రజలు కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తోంది.