ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికలకు ముంగిటే దాడులు జరుగుతాయి. అదీ కూడా అంతా సీక్రెట్‌గా . అక్కడ దాడి జరుగుతుందని ముందస్తుగా అంతా రెడీ చేసుకున్నట్లుగా జరుగుతూ ఉంటాయి. 2019లో ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి.. ఆ తర్వాత దాని చుట్టూ జరిగిన డ్రామా ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఇప్పుడు రాయితే దాడి జరిగింది.
చీకటవ్వగానే లోపలికి వెళ్లిపోతారుగా !
సాధారణంగా చీకటి ప డేసరికి.. అందరికీ గుర్తు చేసి.. చీకటి పడిందని చెప్పి మరీ బస్సులోకి వెళ్లిపోతారు జగన్. కానీ విజయవాడలో చీకటి పడినా బస్సు మీద నిలబడే వెళ్లారు. ఆ సమయానికి సెక్యూరిటీ వాళ్లు అంతా కింద కూర్చున్నారు. రాయి దూసుకొచ్చిన తర్వాతనే మళ్లీ తిరిగి వచ్చారు. కొన్ని కెమెరాలు ఆ రాయి పడటాన్ని షూట్ చేశాయి.
మరుక్షణంలో ప్రారంభమైన సింపతీ డ్రామాలు
ఇలా దాడి జరుగుతుందని తెలిసినట్లుగా వెంటనే వైసీపీ సోషల్ మీడియా రాజకీయ, సింపతీ డ్రామాలు ప్రారంభించేసింది. జగన్మోహన్ రెడ్డి నటనా నైపుణ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబే రాయి వేయించాడని .. ఆరోపణలు ప్రారంభించారు. విషాద మ్యూజిక్ తో వీడియోలు కూడా వదులుతున్నారు.
చంద్రబాబు మీద పదుల సార్లు రాళ్ల దాడులు !
ఐదేళ్లలో చంద్రబాబు మీద బహిరంగంగా చంద్రబాబు మీద రాళ్ల దాడులు చేశారు. మార్కాపురంలో చంద్రబాబుపై వేసిన రాళ్లు తగిలి ఓ వృద్ధుడు చనిపోయాడు. అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై రాళ్లు ఆపడానికి కమెండోలు అంతా శ్రమించాల్సి వచ్చింది. కానీ ఇంత డ్రామాలు నిర్వహించడానికి టీడీపీ వాళ్లకు అనుభవం లేకుండా పోయింది.