ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విండోస్ యూజర్లకు స్క్రీన్ పై ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టం రీస్టార్ట్ అవుతోంది.
మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలగడంతో స్టాక్ మార్కెట్ ,విమాన, బ్యాంకింగ్ సేవలూ నిలిచిపోయాయి. పలు విమానాల రాకపోకలు ఆలస్యం అవుతుండగా.. మరికొన్ని చోట్ల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో మైక్రోసాఫ్ట్ యూజర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమకు కలుగుతోన్న అసౌకర్యాన్ని పేర్కొంటూ సోషల్ మీడియాలో విసృతంగా పోస్టులు చేస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ సేవలకు ఆటంకం ఏర్పడటంతో పలు ఎయిర్ లైన్స్ రద్దు కావడంపై ప్రధాన విమానయాన సంస్థలు సాంకేతిక సమస్య గురించి కీలక ప్రకటన చేశాయి. ఈ సమస్యను టెక్నికల్ టీం పర్యవేక్షిస్తోందని.. తొందర్లోనే సేవలను పునరుద్దరిస్తామని తెలిపారు.