చంద్రబాబు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తున్నామంటూ జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు హడావుడి ప్రారంభించారు. సీఐడీ అధికారులు ఐఆర్ఆర్ కేసులో చార్జిషీటు దాఖలు చేసినట్లుగా మీడియాకు లీకులిచ్చారు. అందులో ఏముందో కూడా చెప్పి… కూలీ మీడియాలో బ్రేకింగులు వేయించారు. నిజానికి అవన్నీ పాత కథలే . చెప్పి చెప్పి బోర్ కొట్టించారు. కానీ ఇప్పుడు చార్జిషీట్ల పేరుతో మరోసారి చెబుతున్నారు. నిజానికి చార్జిషీట్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
అచ్చెన్నాయుడుపై పెట్టిన ఏసీబీ కేసులో ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కావాల్సిందేనని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. చార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. అలాంటిది చంద్రబాబుపై చార్జిషీటు దాఖలుకు గవర్నర్ అనుమతి లేకుండా ఎలా న్యాయమూర్తి అనుమతిస్తారని న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే తనపై నమోదు చేసిన కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 17ఏ వర్తింపుపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.
తప్పుడు కేసులు పెట్టి.. కనీస ఆధారాలు లేకుండా విచారణ చేసి.. చివరికి అవే పిట్టకథలతో చార్జిషీట్లు వేసేస్తున్నారు దర్యాప్తు అధికారులు. అసలు తప్పేమిటో.. ఎక్కడ జరిగిందో.. ఎక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్లాయో చెప్పకుండా.. ఏదో అడ్డగోలు కబుర్లతో చార్జిషీట్లు వేస్తే.. మన వ్యవస్థలు అంత బలహీనంగా ఉంటాయని ఎందుకు అనుకుంటారో !